CM Revanth Reddy: పొలిటికల్ ఫ్రైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి.. ఎంపీగా, విపక్ష నాయకుడిగా అధికార బీఆర్‌ఎస్‌తో మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నట్లుగా కాంగ్రెస్ తరఫున ఫైట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుడిగా ముందుండి పార్టీని గెలిపించారు. సీఎంగా తెలంగాణ పాలనా పగ్గాలు చేపట్టారు. సూటిగా, సుత్తి లేకుండా , ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా మాట్లాడగల సమర్ధుడు. ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అంటూ ప్రశ్నించే రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు మాత్రం కొరకరాని కొయ్య.
ఫుట్‌బాల్ ఆడి సందడి..
రేవంత్‌రెడ్డికి ఆహారం, ఆటలు, వ్యాయామం ఈ మూడు చాలా ఇష్టమైనవి. చికెన్, బిర్యానీ ఇష్టంగా తింటారు. ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేస్తారు. ఇక ఆటలంటే చాలా ఇష్టం క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడతారు. ఇటీవల నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. అర్గుల్ రాజారామ్ మెమోరియల్ పేరిట ప్రారంభించిన ఫుట్ బాల్ పోటీల్లో కాసేపు రేవంత్ కూడా ఫుట్‌బాల్ ఆడి అలరించారు. విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం ప్లేయర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి కాసేపు మ్యాచ్‌ను వీక్షించారు. రేవంత్ స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ఫుట్‌బాల్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన సీఎం కావడంతో తమతో ఫుట్‌బాల్ ఆడిన నేత తెలంగాణ సీఎం కావడాన్ని క్రీడాకారులు గుర్తు చేసుకుంటున్నారు. రోనాల్డో.. రేవంత్.. తెలంగాణ సీఎం అంటూ నాటి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి అభినందిస్తున్నారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వీలు దొరికితే ఫుట్‌బాల్ ఆడతా..
ఇదిలా ఉండగా, తనకు ఫుట్‌బాల్ ఆడటమంటే బాగా ఇష్టమని, సమయం దొరికినప్పుడు ఆడుతూ ఉంటానని రేవంత్ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఫుట్‌బాల్ ఆడటం వల్ల ఫిట్‌నెస్ కూడా వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటే ఫుట్‌బాల్ ఆడతానని ఇటీవల పలు ఛానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో రేవంత్ వెల్లడించారు.