https://oktelugu.com/

KCR vs BJP: బీజేపీని తిట్టిపోసి.. ధాన్యం భారం దించుకొని.. కేంద్రంపైకి డైవర్ట్ చేసిన కేసీఆర్!

KCR vs BJP: ఏదైతేనేమి.. సీఎం కేసీఆర్ తనపై ఉన్న ‘ధాన్యం’ భారం దించేసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో తెలంగాణలో ధాన్యపు సిరులు వెల్లువలా వచ్చాయి. విపరీతంగా ధాన్యం పండింది. కేంద్రం మాత్రం కొనకుండా కొర్రీలు వేసింది. దాని కోసం ధర్నా చేసి .. ఢిల్లీలో ఫైట్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న కేసీఆర్ ఇక చేసేదేం లేక తన కాడి వదిలేశాడు. ఈ క్రమంలోనే తన వాదన వినిపించేందుకు ఏకంగా గంటన్నర సేపు ప్రెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2021 / 08:47 AM IST
    Follow us on

    KCR vs BJP: ఏదైతేనేమి.. సీఎం కేసీఆర్ తనపై ఉన్న ‘ధాన్యం’ భారం దించేసుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో తెలంగాణలో ధాన్యపు సిరులు వెల్లువలా వచ్చాయి. విపరీతంగా ధాన్యం పండింది. కేంద్రం మాత్రం కొనకుండా కొర్రీలు వేసింది. దాని కోసం ధర్నా చేసి .. ఢిల్లీలో ఫైట్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న కేసీఆర్ ఇక చేసేదేం లేక తన కాడి వదిలేశాడు. ఈ క్రమంలోనే తన వాదన వినిపించేందుకు ఏకంగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

    kcr modi rice

    నిన్న రాత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత కేసీఆర్ గంటన్నరసేపు మాట్లాడారు. కేవలం బీజేపీని తిట్టడానికే.. ధాన్యం బరువు దించుకోవడానికే ప్రయత్నించారని తెలుస్తోంది. స్థూలంగా కేసీఆర్ చెప్పిన ధాన్ని బట్టి తెలంగాణ రైతులపై పిడుగు వేశారు. ఇక వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.. రైతులు ఎవరైనా సరే పంట పండించుకున్నా ఎవరికి వారు అమ్ముకోవాలి. ప్రభుత్వం ధాన్యం కొనదు. కేంద్రం ఎఫ్.సీఐ ద్వారా సేకరించదు. ఇదంతా బీజేపీ వల్లేనని కేసీఆర్ నెపాన్ని మొత్తం కేంద్రంతో తోసేసి .. బీజేపీని చెడామడా తిట్టేసి తెలంగాణ రైతుల వ్యతిరేకత తనపై పడకుండా తప్పించుకున్నారు. తెలంగాణలో ధాన్యం కొనకపోవడం వెనుక మొత్తం కేంద్రానిదే బాధ్యత అని డైవర్ట్ చేసేశారు.

    ఇక కేసీఆర్ ఢిల్లీ వెళితే అపాయింట్ మెంట్ కూడా దక్కకపోవడంపై బరస్ట్ అయ్యారు. ఢిల్లీకి వెళితే బిచ్చగాళ్లలాగా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డిని చేతకాని దద్దమ్మగా అభివర్ణించారు. రైతుల హత్యల ప్రభుత్వంగా బీజేపీని అభివర్ణించారు.

    Also Read: కేసీఆర్ లో భయం.. కరీంనగర్ ఎమ్మెల్సీ సీటు కోల్పోనుందా?

    మొత్తంగా కేసీఆర్ ప్రసంగం మొత్తం బీజేపీని తిట్టడానికే సరిపోయింది. వరి పంట వేయవద్దని.. ప్రత్యామ్మాయ పంటలను వేయాలని కూడా కేసీఆర్ అనలేదు. దీన్ని బట్టి ఇక రైతులు పండించిన ఏ ధాన్యం అయినా కొనమని.. వాళ్లే పండించుకోవాలి.. వాళ్లే అమ్ముకోవాలన్న కఠిన వాస్తవాన్ని వివరించారు. ఈ వైఫల్యాన్ని బీజేపీకి అంటకట్టేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నించారు.

    కేసీఆర్ వరిధాన్యం కొనుగోళ్లపై ఎంత యాగి చేసినా.. పార్లమెంట్ లో ఆందోళన చేసినా.. ఢిల్లీ వెళ్లినా బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారన్న ఆవేదన ఆయనలో కనిపించింది. ఇక ఈసారి బండి సంజయ్ ను వదిలేసి కిషన్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేశారు. బండిని తిడితే పాపులర్ అవుతాడని కేసీఆర్ డైవర్ట్ చేశాడని తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ అనుకున్నది ప్రెస్ మీట్ ద్వారా సాఫల్యమైంది. కానీ కొనుగోళ్ల అంశం కేసీఆర్ సర్కార్ పుట్టిముంచే ప్రమాదం ఉందని అర్థమవుతోంది.

    Also Read: కేంద్రంతో అమీతుమీకే కేసీఆర్ సిద్ధం?