https://oktelugu.com/

CM Kcr To Visit Delhi For Dental Treatment: ఢిల్లీ వెళ్లాలంటే.. పంటి నొప్పి రావాలా? బంగారు తెలంగాణలో చికిత్స లేదా?

CM Kcr To Visit Delhi For Dental Treatment: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత ఫాం హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పటి వరకు కేంద్రంతో సఖ్యతగా ఉన్న సీఎం.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నదా అని ప్రశ్నించేవారు. కానీ హుజూరాబాద్‌లో ఈటల విజయంతో బీజేపీ కే సీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటకు తీసుకొచ్చింది. మరోవైపు రోజుకు అంశంపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తుండడంతో ఎక్కడ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2022 / 02:25 PM IST
    Follow us on

    CM Kcr To Visit Delhi For Dental Treatment: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత ఫాం హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అప్పటి వరకు కేంద్రంతో సఖ్యతగా ఉన్న సీఎం.. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నదా అని ప్రశ్నించేవారు. కానీ హుజూరాబాద్‌లో ఈటల విజయంతో బీజేపీ కే సీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటకు తీసుకొచ్చింది. మరోవైపు రోజుకు అంశంపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తుండడంతో ఎక్కడ మీటింగ్‌ పెట్టినా.. ఎప్పుడు ప్రెస్‌మీట పెట్టినా బీజేపీని విమర్శించకుండా ఉండలేని పరిస్థితి కల్పించింది. ఇక వానాకాలాం ధాన్యం కొనుగోలుతో ఈ లొల్లి మరింత ఎక్కువైంది. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న సీఎం ప్రధానమంత్రికి ముఖం చూపించుకోలేని పరిస్థితికి దిగజారాడు.

    KCR

    -ఢిల్లీ వెళ్లడానికి కారణాలు వెతుకోవాల్సిన పరిస్థితి..

    రాష్ట్ర సమస్యలపై, రైతుల సమస్యలపై, గిరిజన రిజర్వేషన్లపై కేంద్రంతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లని సీఎం కే సీఆర్‌ ధాన్యం లొల్లి తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు కారణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. గతనెల కేసీఆర్‌ భార్య శోభమ్మకు వైద్య పరీక్షల పేరుతో ఢిల్లీ వెళ్లారు. ఐదు రోజులపాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌ను కలిసే ప్రయత్నం చేసినా ఆప్‌ నాయకులు కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. దీంతో పరీక్షల ముగిశాయని ఐదు రోజులకు తెలంగాణకు తిరిగి వచ్చారు. తాజాగా మళ్లీ బుధవారం ఢిల్లీ బయల్దేరారు. ఇందుకోసం పంటినొప్పి కారణం అని సీఎంఓ నుంచి ఓ ప్రకటన విడుదల చేయించారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దించడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ లేఖ రాసిన రెండు రోజులకే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఆయన మాత్రం పంటి నొప్పితో ఢిల్లీ వెళుతున్నట్లు చెబుతున్నారు.

    Also Read: Current Shock: కేసీఆర్ యే కాదు.. జగన్ కూడా ‘షాక్’ ఇచ్చాడు! పెరిగిన కరెంట్ ఛార్జీలివే!

    -పంటి నొప్పికీ ఇక్కడ చికిత్స లేదా?

    కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌లో లేదు. వాస్తవంగా ఆయన గురువారం వేములవాడలో పర్యటించాల్సి ఉంది. కానీ సడెన్‌గా పంటి నొప్పి అంటూ బుధవారం ఉదయం ఢిల్లీ విమానమెక్కారు. వైద్యరంగంలో, సాంకేతిక పరంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకునే సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు కేవలం చిన్న పంటినొప్పి వస్తే చికిత్సకు ఢిల్లీ వెళ్లాలా అంటూ ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. కేంద్రంతో ఇన్నాళ్లూ కొట్లాడినట్లు చేసిన కేసీఆర్‌కు ప్రస్తుతం తన సమార్థం ఏమిటో అర్థమై ఉంటుందని, అందేకే కేంద్రంతో సఖ్యత పెంచుకోవడానికి రాయబారం నడిపేందుకే ఢిల్లీ వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. లేదంటే బంగారు భారంత కోసం ఢిల్లీకి వస్తున్నా అంటూ ఇటీవల నినదిస్తున్న కేసీఆర్‌ అందులో భాగంగా కూటమి చర్చల పేరుతో ఢిల్లీ వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.

    KCR

    ఆయనతో కలిసి రాకపోవడంతోనే అనారోగ్యం సాకు..

    ఢిల్లీలోని కేంద్రాన్ని ఢీకొడతానంటూ.. తెలంగాణ ఉద్యమం తరహాలోనే దేశం మొత్తం అగ్గి పెడుతం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తం. ప్రధాని నరేంద్రమోదీని దేశం నుంచి తరిమి కొడుతం అంటూ ఇటీవల నిర్వహించిన పలు బహిరంగ సభల్లో మాట్లాడిన కేసీఆర్‌.. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటించారు. కేంద్రంలో తాను చేసే పోరాటంలో కలిసి రావాలని కోరారు. అయితే కేసీఆర్‌తో కలిసి కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మహారాష్ట్ర వెళ్లిన సమయంలో ఉధ్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరత్‌పవార్‌ను కలిశారు. తర్వాత కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడతో బేఠీ అయ్యారు. అంతకముందు బీహార ప్రతిపక్ష నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడిని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. ఇటీవల జార్ఖండ్‌ వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడారు. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మినహా ఎవరూ కేసీఆర్‌కు కలిసివస్తామని హామీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం మళ్లీ ఎవరితో మంతనాలు సాగిస్తారని, అయితే ఇప్పటికే వివిధ పార్టీలతో జరిపిన చర్చలతో పెద్దగా ఒరిగింది ఏమీ లేకపోవడంతో ఇప్పుడు జరిపే మంతనాల గురించి ప్రకటించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే సడెనగా పంటి నొప్పి ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది.

    Also Read: Uniform Secretariat Employees: జగన్ చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? సచివాలయ ఉద్యోగులకు తీరని వ్యథ

    Tags