KCR vs Modi: దేశంలో పవర్ ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోడీనే. ఆయనను ఎదురించి నిలిచేవారు ఎవరూ లేరు. మోడీ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటినా.. ప్రతిపక్షాలు రోడ్డెక్కినా జనాల్లో మోడీ ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి వాటితో దేశంలో ప్రత్యర్థులను వేధిస్తున్నా కూడా మోడీపై వ్యతిరేకత రావడం లేదు. ఎంత మంది ఎన్ని సార్లు గగ్గోలు పెట్టినా సరే మోడీ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.
-చిత్తైన చంద్రబాబు
ఒకప్పుడు మోడీని గద్దె దించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు స్పెషల్ ఫ్లైట్ లు బుక్ చేసుకొని మరీ చంద్రబాబు తిరిగారు. కానీ బాబు గారు ఏపీలో చిత్తుగా ఓడగా.. అదే సమయంలో మోడీ ఘన విజయం సాధించారు. మునుపటి కంటే కూడా అత్యధిక సీట్లతో దేశంలోనే పవర్ ఫుల్ గా మారారు. మూడేళ్లుగా కనీసం చంద్రబాబు కోరుతున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా మోడీ కాసేపు చంద్రబాబుతో ముచ్చటించి ఆయన ముచ్చట తీర్చారు. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నా మోడీ కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
Also Read: Chikoti Praveen case – TRS Leaders: ఆ ముగ్గురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ కన్ను
-కేజ్రీవాల్, మమత కూడా సైలెంట్ అయ్యారు!
ఇక చంద్రబాబు మాత్రమే కాదు.. దేశంలో మోడీని ఎదురించిన వారిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉన్నారు. వీరిద్దరూ బీజేపీని వారి రాష్ట్రాల్లో ఓడించారు. మోడీని ముప్పుతిప్పలు పెట్టారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండి గవర్నర్లతో కేజ్రీవాల్, మమతలను ఓ ఆట ఆడించాడు మోడీ. కానీ వీరిద్దరూ మోడీతో ఫైటింగ్ లో అలిసిపోయారు. అందుకే కేజ్రీవాల్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మమతా బెనర్జీ పోరాడి పోరాడి ఇక ఊరుకున్నారు. మమతా కేబినెట్ లోని మంత్రి పార్థ చటర్జీ పెద్ద స్కాంలో పట్టుబడ్డాక మమత పూర్తిగా గొడవలకు దూరంగా జరిగారు. బీజేపీతో అస్సలు గిచ్చికయ్యం పెట్టుకోవడం లేదు. జాతీయ రాజకీయాల్లో కలుగజేసుకోనని ఏకంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా జరిగారు.
-మోడీతో పెట్టుకుంటే అంతే..
మోడీతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా జాతీయ స్థాయిలో పాపులర్ అయిన దాఖలాలు లేవు. రాహుల్ గాంధీ నుంచి మొదలుపెడితే చంద్రబాబు వరకూ అందరూ తమ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు. కేజ్రీవాల్, మమత వంటి దిగ్గజాలతోనే కాలేదు. మరి ఇన్ని ఉదాహరణలున్నా కూడా కేసీఆర్ మొండి ధైర్యంతో వెళుతున్నాడు. ఈయనకు బలమైన మోడీని ఎదురించడం సాధ్యమా? అన్నది ఆలోచించడం లేదు.
కేసీఆర్ కు ఇప్పటి పరిస్థితులు తెలుసు. మోడీతో పెట్టుకుంటే తెలంగాణ అభివృద్ధికి విఘాతంతోపాటు లేనిపోని కేసులన్నీ టీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయం. చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ ఎంట్రీ,, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసుల వ్యవహారం లాంటివి కేసీఆర్ సర్కార్ ను ఇబ్బందిపెడుతున్నాయి. అందుకే పట్టుదలకు పోయి మోడీని ఎదిరిస్తే కేసీఆర్ సీటుకే వచ్చే ఎన్నికల్లో ఎసరు వచ్చే అవకాశం ఉంది. ముందుగా మురిస్తే పండుగ కాదన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ఏదో ఊహించుకొని వెళితే దెబ్బైపోవడం ఖాయం..
Also Read:KCR Declares New Pensions: 10 లక్షల పాచిక ముందస్తు కేనా