https://oktelugu.com/

KCR: బిగ్ బ్రేకింగ్: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన కేసీఆర్

KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో కొద్దిరోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో మంత్రులతో ఎమర్జెన్సీ మీటింగ్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. పీకే టీం సూచనల మేరకు తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు చెలరేగాయి.   ఈ క్రమంలోనే కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 21, 2022 / 06:05 PM IST
    Follow us on

    KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో కొద్దిరోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరదించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో మంత్రులతో ఎమర్జెన్సీ మీటింగ్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని జోరుగా ప్రచారం సాగింది. పీకే టీం సూచనల మేరకు తెలంగాణలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు చెలరేగాయి.

     

    ఈ క్రమంలోనే కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. ఇదివరకూ ఈ విషయాన్ని స్పష్టం చేశానని.. మరోసారి అదే విషయం చెబుతున్నట్టుగా కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గతంలో అవసరం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లామని.. జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నా ఆహ్వానం మేరకే ప్రశాంత్ కిషోర్ వచ్చి పనిచేస్తున్నారన్నారు.

    ప్రశాంత్ కిశోర్ ఎనిమిదేళ్లుగా నాకు మంచి స్నేహితుడు అని.. ఆయన ఎప్పుడూ డబ్బులు తీసుకొని పనిచేయరని.. దేశం పట్ల ఆయనకున్న నిబద్దత ఏమిటో మీకు తెలియదని కేసీఆర్ వివరించారు. ఆయన డబ్బులు తీసుకొని పనిచేస్తారని నిరూపిస్తారా? అని సవాల్ చేశారు.

    పార్టీల అవసరాల మేరకు 12 రాష్ట్రాల్లో పనిచేశారని.. తమిళనాడు, ఏపీ, బెంగాల్ తోపాటు బీజేపీకి కూడా ప్రశాంత్ పనిచేశారని విన్నవించారు. దేశ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ కు అవగాహన ఉందని సీఎం తెలిపారు.

    ఇక బీజేపీ యూపీలో గెలిచినా బలం తగ్గిందని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. యూపీలో గతంలో బీజేపీకి 312 సీట్లు వస్తే ఈ ఎన్నికల్లో 255 స్తానాలకు పరిమితమైందన్నారు. సీట్లు తగ్గడం దేనికి సంకతేమో బీజేపీ ఆలోచించుకోవాలి. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Recommended Video: 

    Tags