CM KCR- Prakash Raj: తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజకీయం షురూ చేశారు. బీజేపీపై పోరాటంలో భాగంగా ఆయన ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిశారు . సీఎంను కలిసిన వారిలో సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఉండటం గమనార్హం. రాజకీయాలకు ప్రకాశ్ రాజ్ కు ఏం సంబంధం. ఆయనో సినీ నటుడు. వేషాలు వేసుకోవాలే కానీ రాజకీయాలు చేయకూడదని తెలిసినా సీఎం కేసీఆర్ పర్యటనలో ఆయన కనిఇంచడంపైనే అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీపై ప్రకాశ్ రాజ్ కు కూడా కోపం ఉందని తెలుస్తోంది. గతంలో ఆయన కర్ణాటకలో పోటీ చేసి ఓటమి చవిచూసినట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ అంటే ఒంటి కాలు మీద లేచే ప్రకాశ్ రాజ్ కు సీఎం కేసీఆర్ ఎందుకు పెద్దపీట వేశారో ఇట్టే అర్థమైపోతోంది. ఆయనతో బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ ప్రకాశ్ రాజ్ తో ఏమీ కాదనే విషయం అందరికి తెలిసిందే.
Also Read: ఉదయ్ కిరణ్ మీద అప్పట్లో ఎన్ని పుకార్లు వచ్చాయో తెలుసా..?
కానీ సీఎం కేసీఆర్ వ్యూహంలో ప్రకాశ్ రాజ్ కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియడం లేదు. మొత్తానికి కేసీఆర్ టీంలో ప్రకాశ్ రాజ్ కూడా సభ్యుడు కావడంతో రాజకీయాలు తీరు మారడం ఖాయమనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఎంతవరకు వెళతాయో తెలియడం లేదు. దీంతో రాజకీయాల్లోకి సినిమా వాళ్లు కూడా రంగప్రవేశం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియడం లేదు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ తో ఏ మేరకు ప్రయోజనం ఉందో తెలియడం లేదు. కానీ ప్రకాశ్ రాజ్ కు మాత్రం తెలంగాణలో ఓ కీలక పదవి దక్కవచ్చనే వాదన కూడా వస్తోంది. దీంతో రాజకీయాల్లో ప్రకాశ్ రాజ్ తో కేసీఆర్ ఎంత మేర లబ్ధిపొందుతారో అర్థం కావడం లేదనే వాదన కూడా వస్తోంది.
Also Read: ‘భీమ్లా నాయక్’ ఫంక్షన్ కు పిలవలేదని త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు