CM KCR Master Plan For Early Elections: కొద్ది రోజులుగా తెలంగాణలోని ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికల నినాదం ఎత్తుకుంటున్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే వాదన తెస్తున్నారు. దీనిపై పాలకులు మాత్రం ఏమీ లేదని కొట్టిపారేస్తున్నా వారి పనులు మాత్రం అవే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించడం అందులో భాగమేనని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్షాల వాదన సరైనదే అనే భావం కూడా వస్తోంది. కేసీఆర్ లో వస్తున్న మార్పులను బేరీజు వేసుకుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో గతంలోలాగానే కేసీఆర్ ముందస్తుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో కూడా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. దీని కోసమే నిరుద్యోగుల సమస్య తీర్చారు. ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు లేకుండా చేస్తున్నారు. ఇదంతా ఆయన ముందస్తు వ్యూహంలో భాగమేనని ప్రతిపక్షాలు సైతం మొత్తుకుంటున్నాయి. కానీ అధికార పక్షం మాత్రం అలాంటిదేమి లేదని చెబుతూనే అందుకుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ దూకుడు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే విధంగా ఉందని తెలిసిందే.
Also Read: 13 ఏళ్లు.. 10ఏళ్ల వెసులుబాటు.. నిరుద్యోగుల యాతనకు ఇప్పటికీ ఫలితమా?
ఇన్నాళ్లు నిరుద్యోగ సమస్యపై బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ లు గగ్గోలు పెట్టడం తెలిసిందే. షర్మిల అయితే ప్రతి మంగళవారం నిరుద్యోగ సమస్యలపై దీక్ష కూడా చేపడుతోంది. ఇప్పుడు కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేసిన దృష్ట్యా ఇక ఆమెకు పోరాడేందుకు అంశమే లేకుండా పోయింది. ప్రస్తుతం దేని మీద పోరాటం చేస్తుందో చూడాల్సిందే. ఇక రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి మూడోసారి ముచ్చటగా అధికారం చేజిక్కించుకోవాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నట్లు అర్థమవుతోంది. దీని కోసమే కేసీఆర్ తన శక్తియుక్తులన్ని ధారపోసేందుకు రెడీ అవుతున్నారు.
రాష్ట్రంలో కలియ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారని చెబుతున్నాయి. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రతిపక్షాల విమర్శలకు తావు లేకుండా చేయడంలో కేసీఆర్ సఫలమైనట్లు తెలుస్తోంది.

మొదటి దశ ఎన్నికల్లో సీట్లు తక్కువగా వచ్చినా ఇతర పార్టీల నేతల్ని తీసుకుని సంఖ్యా బలం పెంచుకున్న కేసీఆర్ రెండోసారి మాత్రం స్పష్టమైన మెజార్టీ తెచ్చుకుని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఈ సారి కూడా ఊహించని మెజార్జీ సాధించి మళ్లీ ప్రతిపక్షాలను డైలమాలో పడేయాలని కేసీఆర్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వేడి రగలనుందని పరిస్థితులను బట్టి చూస్తే అవగతమవుతోంది. ఓటరు ఎటు వైపు మొగ్గు చూపి ఏ పార్టీని విజయతీరాలకు చేర్చుతాడో తెలియడం లేదు.
Also Read: ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు కేసీఆర్ రెడీయేనా?