CM KCR Entry into National Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ భారతదేశాన్ని అమెరికాను మించి తీసుకెళుతానని సంచలన ప్రకటన చేశాడు. ఇప్పటివరకూ కాంగ్రెస్, బీజేపీలకు ఇది చాతకాలేదని.. తాను అధికారంలోకి వస్తే అమెరికాను మించి తయారు చేస్తానని అంటున్నారు. నిజానికి దేశ రాజకీయాల్లో ఎంట్రీ కావాలంటే ఇది సరైంది కాదన్న వాదన ఉంది.
ఇప్పటికే జాతీయ రాజకీయాల్లోకి రావాడానికి మమత బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్ లాంటి వాళ్లు లైన్లో ఉన్నారు. వీరందరికీ పోటీగా నేనున్నానని.. కేసీఆర్ వస్తున్నారు. ప్రముఖ పాత్ర వహించమని అందరూ తనను అడుగుతున్నారని కేసీఆర్ చెబుతున్నారు.
దేశ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ సబ్జెక్ట్ ను అవగాహన చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండాలి. అమెరికా ఎక్కడా? భారత్ ఎక్కడా? ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మనకు చాలా తేడా ఉంది. మన దేశజీడీపీ 2.7 లక్షల కోట్లు.. అదే అమెరికా జీడీపీ 19.5 లక్షల కోట్ల డాలర్లు. మనం ఎక్కడ ఉన్నామో దీన్ని బట్టి అర్థమవుతోంది. అమెరికా తర్వాత 15 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉండగా.. జపాన్ సుమారు 4 లక్షల కోట్లతో మూడోస్థానంలో ఉంది. ఆ తర్వాత జర్మనీ.. తర్వాత భారత్ ఉంది.
Also Read: KCR Delhi Tour: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?
మోడీ దీన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు హేళన చేశాయి. 2025కు ఈ లక్ష్యం చేరుతానని మోడీ అన్నారు. ఇంకా రెండు లక్షల కోట్ల డాలర్లు అంటే చిన్న విషయం కాదు. అమెరికాను మించి పోవాలంటే భారత్ ఎంత చేయాలన్నది ప్రశ్న. మరి కేసీఆర్ కల నెరవేరుతుందా? అది సాధ్యమేనా? అంటే అవాస్తవం అని చెప్పొచ్చు. నిజానికి అమెరికానే కాదు.. చైనాను కూడా భారతదేశం చేరువ కాలేదు. మరి కేసీఆర్ మాటలు వాస్తవం అవుతాయా? ఆయన జాతీయ రాజకీయాల కల నెరవేరుతుందా? అన్న దానిపై ‘రామ్ టాక్’ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Also Read: KCR VS BJP: కేసీఆర్ మీడియాపై పడ్డ బీజేపీ.. మూసేస్తుందా?
Recommended Video: