https://oktelugu.com/

KCR IAS Postings : కేసీఆర్ దగ్గర పదవులు ఎవరికిస్తారు? ఎందుకిస్తారో తెలుసా?.. రహస్యం బయటపడింది!

CM KCR IAS Postings : తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీంను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాడన్న పేరుంది. ముఖ్యంగా తెలంగాణను పాలించే సీఎంవోలో కీలకమైన పోస్టుల ఎంపికలో కేసీఆర్ మెరికలు.. పాలనాపరంగా నిరూపించుకున్న అధికారులకు అవకాశం కల్పించారు. అందులో తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఉంది. కానీ సీఎంవోలో దళితులు, గిరిజన ఐఏఎస్ లు ఉండరన్న అపవాదు ఉంది. ఎంత టాలెంట్ ఉన్నా వారికి పదవులు దరిచేరవని అంటుంటారు. అసలు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 31, 2022 / 09:45 AM IST
    Follow us on

    CM KCR IAS Postings : తెలంగాణ సీఎం కేసీఆర్ తన టీంను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాడన్న పేరుంది. ముఖ్యంగా తెలంగాణను పాలించే సీఎంవోలో కీలకమైన పోస్టుల ఎంపికలో కేసీఆర్ మెరికలు.. పాలనాపరంగా నిరూపించుకున్న అధికారులకు అవకాశం కల్పించారు. అందులో తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఉంది. కానీ సీఎంవోలో దళితులు, గిరిజన ఐఏఎస్ లు ఉండరన్న అపవాదు ఉంది. ఎంత టాలెంట్ ఉన్నా వారికి పదవులు దరిచేరవని అంటుంటారు. అసలు కేసీఆర్ దగ్గర పదువులు ఎవరికి లభిస్తాయి? ఎందుకు లభిస్తాయి? ఆ బ్రహ్మరహస్యాన్ని తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలిపారు. అవిప్పుడు తెలంగాణలో పెను సంచలనమయ్యాయి.

    ‘తెలంగాణ బిడ్డనైనా నన్ను ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదరించారు.. వరల్డ్ బ్యాంకుల్లో పనిచేసిన నాకు ముఖ్యమంత్రులు మంచి పోస్టులు ఇచ్చి సర్వీస్ చేయించుకున్నారు.. కానీ తెలంగాణ వచ్చాక.. తెలంగాణ ప్రాంతానికి చెందిన నన్ను సీఎం కేసీఆర్ ఘోరంగా అవమానించారు.. నేనడిగిన ఓ పోస్టును ఇవ్వడానికి నిరాకరించారు.. సర్వీసులో ఎన్నో పనులు చేసిన నాకు కేసీఆర్ అలా అనడంపై తీవ్రంగా మనస్థాపం చెందా.. అందుకే ఇక తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయడం దండగ అనుకొని వీఆర్ఎస్ తీసుకున్నా..’ అని రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై వివక్ష చూపిందని ఆరోపిస్తున్న ఆయనను ఏపీ ప్రభుత్వం ఆదరించింది. విద్యాకమిటీ సలహాదారుగా బాధ్యతలు అప్పజెప్పింది. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

    Also Read: Internet Cut In Konaseema: కోనసీమలో ఇంటర్నెట్ కట్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవస్థలు అంతా ఇంతాకాదు..

    ‘ఒక రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటాడు. అలాంటి సీఎం ప్రవేశపెట్టిన కొన్ని మంచి పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలనుకుంటాడు. ఈ సమయంలో మంచి అధికారులను ఎన్నుకుంటారు. చంద్రబాబునాయుడు హయాంలో డ్వాక్రా మహిళల గ్రూపు లో పనిచేశాను. నాతో పాటు కొప్పుల రాజు గారు ఉన్నారు. కోటి మంది మహిళలను గ్రూపులుగా తయారు చేయించాం. ఆ సమయంలో మమ్మల్ని ఉపయోగించుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నన్ను వాడుకోలేదు. నేను ఆర్ అండ్ బీలో ఆన్ ఫిట్.. ఆ శాఖలో నేను సరిగ్గా పనిచేయలేదు. కానీ ఇంకో శాఖకు ఉపయోగించుకోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నేను ఆర్ అండ్ బి ఇంజనీర్ గా ఉన్న సమయంలో ‘ఉపాధి హామీ’ పథకం డైరెక్టర్ ను చేశారు. ఎందుకంటే ఆ వ్యవస్థకు నేను షూట్ అవుతాను కాబట్టి..ఇందులో మేము లక్షల ఎకరాల భూములను అభివృద్ధి చేశాం..’

    ‘నేను భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో పోస్టు అడిగాను.. ఆ తరువాత ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా పోస్టు కావాలని అడిగాను. ఆ సమయంలో రాజీవ్ శర్మగాను నన్ను సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. ప్రపంచ బ్యాంకుల్లో పనిచేసిన నాకు ఈ పోస్టు విషయంలో కేసీఆర్ అలా అనేసరికి ఆవేదన చెందా.. 32 దేశాల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన నాకు ఆ పోస్టు ఇవ్వడానికి ఎందుకంట భయం..? నేనేం లంచాలు తీసుకోవడం లేదు గదా..? నేనుం సెల్ఫీష్ ను కాదు కదా..? అందుకే అప్పటి నుంచి కేసీఆర్ పై కోపం స్ట్రాట్ అయింది. తెలంగాణ రాకముందు బ్రాహ్మాండంగా వర్క్ చేశా.. కానీ తెలంగాణ వచ్చాక.. ఏం చేయలేకపోయానేని బాధ కలిగింది..’

    Also Read: Rajya Sabha-Telangana: తెలంగాణ నుంచి రాజ్యసభ వెళ్లే వారెవరో?

    ‘నేను పనిచేసిన ఆర్ అండ్ బీలో వివక్ష బాగా ఉండేది. నేను బ్యాక్ వర్డ్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి ప్రైమ్ పోస్టులు ఇవ్వలేదు. ఈ శాఖలోని కొన్ని ప్రత్యేక కార్యాలయాల్లోకి మాలాంటి వారిని రానిచ్చేవారు కాదు. డబ్బులు వచ్చే పోస్టుల్లోకి మమ్మల్ని రానిచ్చేవారు కాదు.. బ్రిడ్జిలు కట్టే పోస్టులకు పంపేవారు. ఇక్కడి ప్రొఫెషనల్ కాంట్రాక్టర్స్ వస్తారు. వారు లంచాల విషయంలో కాంప్రమైజ్ కారు. సో .. నేను కూడా అలాంటి పనులకు షూట్ అయ్యాను. అలా కమిట్మెంట్తో చేయడం వల్ల విజయరమణారావు నాకు రాజమండ్రిలో పెద్ద పోస్టు ఇచ్చారు. ఆ తరువాత కొన్ని జిల్లాల నుంచి కూడా పిలిచారు. రూ.15 లక్షలు పెట్టి కొనుక్కునే పోస్టు ఒకటి నాకు ఉచితంగా ఇస్తామన్నారు. కానీ నా ఆలోచనలు వేరు.. నేనో కమిట్మింట్ తో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యా.. ఆ తరువాత ఉపాధిహామీలోకి వచ్చా.. ’ అని ఆకునూరి మురళి అన్నారు.