https://oktelugu.com/

KCR vs BJP: బీజేపీని కొట్టేయాలి.. కేసీఆర్ కేబినెట్ విస్తరణ వెనుక భారీ ప్లాన్?

KCR vs BJP: తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కొట్టేయాలి.. ఎలా కొట్టాలి? ఎప్పుడు కొట్టాలి.. కేసీఆర్ రాజకీయ చాణక్యంలోని అన్ని వ్యూహాలకు పదును పెట్టి మంత్రివర్గ విస్తరణతో షూరు చేయాలని డిసైడ్ అయ్యాడు. తెలంగాణలో బలంగా తయారవుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి ధీటైన నాయకత్వం , నేతలు అవసరం. అందుకే కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఏఎస్ ను రాజీనామా చేయించడం.. బీజేపీ రాజ్యసభ ఎంపీని ఎమ్మెల్సీని చేయడం.. ఇలా కేసీఆర్ చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. అస్సలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2021 / 09:25 AM IST
    Follow us on

    KCR vs BJP: తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని కొట్టేయాలి.. ఎలా కొట్టాలి? ఎప్పుడు కొట్టాలి.. కేసీఆర్ రాజకీయ చాణక్యంలోని అన్ని వ్యూహాలకు పదును పెట్టి మంత్రివర్గ విస్తరణతో షూరు చేయాలని డిసైడ్ అయ్యాడు. తెలంగాణలో బలంగా తయారవుతున్న బీజేపీని ఎదుర్కోవడానికి ధీటైన నాయకత్వం , నేతలు అవసరం. అందుకే కేబినెట్ విస్తరణకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఏఎస్ ను రాజీనామా చేయించడం.. బీజేపీ రాజ్యసభ ఎంపీని ఎమ్మెల్సీని చేయడం.. ఇలా కేసీఆర్ చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. అస్సలు ఊహించని విధంగా రాజకీయం చేయడం కేసీఆర్ కు అలవాటు. కేసీఆర్ చర్యలన్నీ చూస్తే కమలం పార్టీకి ఎదురెళ్లేలానే మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్టు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఎలా ముందుకెళుతాడన్న దానిపై స్పెషల్ ఫోకస్..

    kcr vs bjp

    హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికెషన్ జారీ కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కేటాయింపులో బిజీగా మారారు. ఇప్పటికే కొందరి పేర్లు అనౌన్స్ చేశారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ కోటాలో ఈ ఎన్నికలు ఉండడంతో దాదాపు ఈ స్థానాలు గులాబీ పార్టీకే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం ఆశించిన వారికి నిరాశ ఎదురవ్వగా.. అనుకోకుండా అవకాశం వచ్చిన వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుండడంతో కొత్తగా ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన వారిలో కేబినెట్లోకి వెళ్తామనే ధీమా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

    మంత్రి వర్గ విస్తరణ మరోసారి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల తరువాత చేపడుతున్న ఈ విస్తరణలో కొందరికి ఉద్వాసన పలకగా.. కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు  కేబినేట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బర్త్ రప్ కావడంతో ఓ శాఖ ఖాళీ అయింది. అయితే ఆ శాఖను ప్రస్తుతానికి హరీశ్ రావుకు అప్పగించారు. ఆర్థిక, వైద్య శాఖలు ముఖ్యమైన వారికే ఇస్తూ వస్తున్నారు. అందుకే ఈటల తరువాత వైద్య శాఖను ఇతరులకు కాకుండా హరీశ్ రావుకే అప్పగించారు. దీంతో వైద్య, ఆర్థిక శాఖలను హరీశ్ రావును నుంచి తొలగించే అవకాశాలు లేవని అంటున్నారు.

    తొలి కేబినెట్లో వరంగల్ జిల్లా నుంచి రాజయ్యకు అవకాశం ఇచ్చి వైద్య మంత్రిని చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనను తొలగించి కడియం శ్రీహరికి అప్పగించారు. అయితే 2018 ఎన్నికల తరువాత కడియం శ్రీహరికి అవకాశం రాలేదు. తాజాగా ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దీంతో మరోసారి కడియం శ్రీహరికి అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఊహించని విధంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కూడా అవకాశం ఇవ్వడంతో ఆయనకు రెవెన్యూ మంత్రిని చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

    అయితే వరంగల్ జిల్లా నుంచి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశలు పెంచుకున్నారు. కానీ సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇటీవల దళిత బంధు పథకం ప్రవేశపెట్టినా వాటి ఫలాలు అందలేదని కొందరు దళితులు నిరసన తెలిపారు. దీంతో కడియం శ్రీహరికి ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీ చేయనున్నారు. ముదిరాజ్ వర్గానికి చెందిన ఆయనకు కూడా మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. దీంతో ఈటల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేయవచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ కు పట్టున్నా ఇటీవల బీజేపీ విస్తరిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోనేవారికి కేబీనోట్లో తాజాగా చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కడియం శ్రీహరి, బండప్రకాశ్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వాళ్లు రాజకీయంలో తలపపండిన నాయకులు. దీంతో బీజేపీకి ఎదుర్కోవడానికి సరైన నాయకులు కేబినేట్లో ఉండేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ని కూడా మంత్రి వర్గంలో తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనుకుంటున్నారు. ప్రత్యర్థులు ఊహించని విధంగా ఎత్తులు వేసే కేసీఆర్ ఈ సారి ఏం ప్లాన్ చేశాడన్నది ఆసక్తి రేపుతోంది.