https://oktelugu.com/

Crop Rotation: తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా?

Crop Rotation: దేశంలో రైతు అంటే అందరికీ లోకువే. ఇన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతుకు.. తను పండించే పంటను కూడా స్వయంగా ఇది వేయాలని నిర్ణయించుకోలేని ధైన్యం ఈ దేశంలో ఉందంటే అతిశయోక్తి కాదు. పంటను పండించవద్దని ప్రభుత్వాలు రైతులను కోరుతున్నాయంటే అంతకంటే ధౌర్భాగ్యం మరొకటి లేదు. పండించిన పంటను కొనేందుకు కేంద్రం రాదు.. పంట కొనుగోలు చేయాలని తెలంగాణసర్కారే రోడ్డెక్కడం.. చివరకు యాసంగిలో వరి పంటను వేయవద్దని కేసీఆర్ పిలుపునివ్వడం.. ఇలా రైతుల […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 09:10 PM IST
    Follow us on

    Crop Rotation: దేశంలో రైతు అంటే అందరికీ లోకువే. ఇన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న రైతుకు.. తను పండించే పంటను కూడా స్వయంగా ఇది వేయాలని నిర్ణయించుకోలేని ధైన్యం ఈ దేశంలో ఉందంటే అతిశయోక్తి కాదు. పంటను పండించవద్దని ప్రభుత్వాలు రైతులను కోరుతున్నాయంటే అంతకంటే ధౌర్భాగ్యం మరొకటి లేదు. పండించిన పంటను కొనేందుకు కేంద్రం రాదు.. పంట కొనుగోలు చేయాలని తెలంగాణసర్కారే రోడ్డెక్కడం.. చివరకు యాసంగిలో వరి పంటను వేయవద్దని కేసీఆర్ పిలుపునివ్వడం.. ఇలా రైతుల గోసను ఆలకించే నాథుడే లేడు. వారి పంటను వారు స్వతహాగా పండించుకోలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో దాపురించింది. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? తెలంగాణలో పంట మార్పిడి విధానాన్ని బీజేపీ  వ్యతిరేకించడం ఏ విధంగా సమర్థనీయం. ఒక జాతీయ పార్టీ అయ్యిండి జాతీయ విధానానికి వ్యతిరేకంగా అవకాశ వాద వైఖరిని తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

    CropRotation BJP TRS

    ఈ విషయంలో కేసీఆర్ ను వ్యతిరేకించినట్టు కాదు.. కేసీఆర్ పంట మార్పిడి అన్నది సరైన విధానం. ఈ విధానాన్ని కేంద్రంలోని బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్పితే పంట మార్పిడి విధానం తప్పు అని ఎలా చెబుతారు?

    ఇంత మాత్రాన కేసీఆర్ రాజకీయాలను సమర్థించినట్టు కాదు.. కేసీఆర్ గత ఏడేళ్లలో పరిపాలనను సరైన దిశలో నడిపించలేదన్నది వాస్తవం. కుటుంబ పాలనను పెంచి పోషించాడన్నది నిజం.

    Also Read: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?

    అంతమాత్రాన కేసీఆర్ నిర్ణయాలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్మాయ పంట పండిచాలని పిలుపునివ్వడం.. రెండోది.. దేశవ్యాప్తంగా సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ఉండాలన్నది రెండూ కరేక్టే. ఈ రెండూ కేసీఆర్ డిమాండ్లు న్యాయమైనవే.. మరి బీజేపీ ఎందుకు వీటిని వ్యతిరేకిస్తోంది? బీజేపీ ఈ నిర్ణయంతో తెలంగాణలో సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా? అన్న దానిపై ‘రామ్ టాక్’ స్పెషల్ వ్యూపాయింట్ ను ఈ కింద వీడియోలో చూడొచ్చు.

    Also Read: నేను, నా దేశం.. ఓ పెట్టుబడిదారుడు..