CM Jagan- Kodali Nani: వైసీపీలో నోరున్న నేతలు వెనుకబడిపోతున్నారు. ఈ మాట నిజం. జగన్ చేసిన సర్వేలోనే ఇది వెల్లడైంది. ప్రత్యర్థులపై టార్గెట్ చేసే క్రమంలో తమ పరిస్థితిని కొంతమంది మరిచిపోతున్నారు. తమకు తిరుగులేదన్న భ్రమల్లో బతికేస్తున్నారు. అయితే అటువంటి వారికి వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని తెలియడంతో సీఎం జగన్ సైతం కలవరపడుతున్నారు. ఇన్నాళ్లూ వారికి తెగ స్వేచ్ఛనిచ్చానని.. అదే కొంప ముంచుతోందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలకే పరిమితమవుతున్న కొంతమంది నాయకులు నియోజకవర్గాలను వదిలిపెడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం ముఖం చాటేస్తున్నారు. అటువంటి నేతలను పిలిచి మాట్లాడుతున్న సీఎం గట్టిగానే క్లాస్ పీకుతున్నట్టు తెలిసింది.
Also Read: Hyper Adi – Pawan : ఇది ఎవడ్రా రాసింది.. పవన్ కళ్యాణ్ ను అన్నందుకు సీరియస్ అయిన హైపర్ ఆది
సీఎం జగన్ గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అదే మీ పనితీరుకు కొలమానం అని కూడా నిర్థారించారు. ప్రజల్లోకి వెళ్లి మీకు మీరుగా నిరూపించుకోకపోతే మాత్రం టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడబోనని ఎమ్మెల్యేలు, మంత్రులకు హెచ్చరించారు. ఎన్నికలు ఆరు నెలల ముందే టిక్కెట్లు ప్రకటిస్తానని.. అప్పటివరకూ పనితీరు మదిస్తానని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే వర్క్ షాపుల పేరిట ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమవుతున్నారు. వెనుకబడిన ఎమ్మెల్యేల పేర్లు సమావేశంలోనే వెల్లడిస్తున్నారు. అయితే నోరున్న నేతలను మాత్రం పర్సనల్ గా పిలిచి హెచ్చరికలు జారీచేస్తున్నారు.
అయితే ఈ జాబితాలో మంత్రులు, తాజా మాజీలు ఉండడం విశేషం. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ మంత్రి కొడాలి నాని, సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్ వంటి వారి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. ఇందులో కొడాలి నానికి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడారు. పనితీరు మెరుగుపరచుకోవాలని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏమంత బాగాలేదు. వీలైనంత వరకూ ప్రజల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకో అంటూ సూచించినట్టు సమాచారం. దీనిపై కొడాలి నాని నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో తనను పడగొట్టేవాడు ఎవడంటూ నాని కాస్తా గట్టిగానే మాట్లాడినట్టు సమాచారం.
అయితే తనను సీఎం హెచ్చరించిన వ్యాఖ్యలు మీడియాలో ఎక్కడ హైప్ అవుతాయని భావించిన నాని విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రోజుకు 3 గంటలు తిరుగుతున్నావని.. 6 గంటలు తిరగాలని సీఎం సూచించినట్టు చెబుతున్నారు. మాకు ఇలా గాలికొదిలేస్తే అందరం మునుగుతాం. సీఎం జగన్ ఇలా చేయడమే కరెక్ట్. నాకు పర్సనల్ గా పిలిచి అన్ని మాట్లాడారంటూ నాని వెల్లడించారు. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యేల్లో భిన్న వాదన వినిపిస్తోంది. నోరున్న నేతలను పర్సనల్ గా పిలిచి నాలుగు గోడల మధ్య చెబుతున్నారు. అదే సామాన్య ఎమ్మెల్యేలనైతే సమావేశంలోనే అవమానిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Pawan Kalyan : అంధ యువతి హత్య : ఆ ఒక్క మాటతో జగన్ పాలన వైఫల్యంపై పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్న