AP Assembly: ఏపీ సీఎం జగన్ నాలుక మడతెట్టేస్తున్నాడు. మాట తప్పడు.. మడమ తిప్పనన్న పెద్దమనిషి వరుసగా రెండు రోజుల్లో రెండు సంచలన నిర్ణయాలతో అందరికీ షాక్ ఇచ్చాడు. మూడు రాజధానులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి.. మళ్లీ కోర్టుల్లో చిక్కుకోకుండా పకడ్బందీగా బిల్లు తెస్తామని అందరి ఆనందానికి షాక్ లు ఇచ్చిన ఘనత జగన్ దే. పొద్దున్న సంబరాలు చేసుకున్న అమరావతి రైతులు జగన్ ప్రకటన తర్వాత హతాషులయ్యారు.
Also Read: తగ్గేదేలే! జస్ట్ గ్యాప్ ఇచ్చాడంతే.. ఏపీ రాజధానిపై జగన్ సంచలనం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నుంచి టీడీపీ నేతల వరకూ మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రద్దు చేసుకుంటున్నాడని హర్షం వ్యక్తం చేశారు. కానీ జగన్ మాత్రం కేవలం కోర్టు కేసుల్లో చిక్కుకున్నందుకే పాత బిల్లును రద్దు చేసి కొత్త బిల్లును తీసుకొస్తున్నట్టు తెలుపగానే షాక్ అయ్యారు. తన నిర్ణయం విషయంలో తగ్గేది లేదని స్పష్టం చేశారు.
టీడీపీకి అత్యంత బలం ఉండి.. బిల్లులన్నింటిని అడ్డుకుంటున్న శాసనమండలిని గతంలో ఇదే జగన్ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకున్నారు. మంగళవారం ఈ మేరకు ఆర్థిక, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
జనవరి 27,2020లో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానించారు. కేంద్రానికి పంపారు. కానీ కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి ఈ నిర్ణయాన్ని పట్టించుకోలేదు. పెండింగ్ లో పెట్టారు. ఎటూ తేల్చలేదు. దీంతో శాసనమండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలి రద్దు ఉపసంహరణ తీర్మాణానికి శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇటీవలే మండలిలో ఖాళీ అయిన 12 ఎమ్మెల్సీ స్థానాలను మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో మండలిలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పుడక్కడ బిల్లులు పాస్ చేసుకోవడం ఈజీ. అంతే జగన్ చెప్పినట్టే జరుగుతుంది. అందుకే రద్దు చేసిన శాసనమండలిని జగన్ తిరిగి పునరుద్ధరించారు.
Also Read: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?