CM Jagan- Early Elections: తెలంగాణ అయినా.. ఏపీ అయినా ఇప్పుడు అందరిదీ ఒకటే ఆందోళన.. వచ్చే సారి గెలవడం కష్టమేనన్న భయాలు అధికార పార్టీలను వెంటాడుతున్నాయి. అందుకే ‘ముందస్తు’గా సర్దుకునే పనిలో పడ్డారు. అందుకే కేసీఆర్, జగన్ లు సర్వేల పేరిట తమ జాతకాలను తెలుసుకునే పనిలో పడ్డారు. సర్వేలు జోరుగా చేయిస్తున్నారు. వచ్చే 8 నెలల పాటు ప్రజలతో మమేకం కావాలని డిసైడ్ అయ్యారు.
పార్టీలో వ్యతిరేకత కలిగిన ఎంపీ, ఎమ్మెల్యేలను పక్కనపెట్టాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న పవర్ ఫుల్ లీడర్లను తన పార్టీలోకి లాగేందుకు తన టీంను పంపుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ టిక్కెట్ పై పార్టీలో చేరేందుకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలకు వైసీపీ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చినట్టు సమాచారం. కొన్ని సందర్భాల్లో ఎన్నికల సమయంలో అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని వైసీపీ ఆ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: Telangana BJP- Congress: కమలంలో నిస్తేజం.. కాంగ్రెస్‌లో కనిపించని చేరికల జోష్..!!
ప్రశాంత్ కిషోర్ టీం, ఇంటెలిజెన్స్ టీం సూచనలతో కొందరు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే కొన్నిరహస్య సమావేశాలను జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోస్తాంధ్రకు చెందిన బలమైన నాయకుడు టీడీపీ, వైసీపీ కాకుండా వేరే పార్టీలో ఉన్నారు. ఆయనంటే నియోజకవర్గ ప్రజలకు అభిమానం. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన మొగ్గుచూపుతున్న ఆ సీటులో టీడీపీ మాజీ మంత్రి కాచుకొని కూర్చున్నాడు. దీంతో జగన్ టీం ఆయనతో చర్చలు జరిపి వైసీపీలో టికెట్ హామీ ఇచ్చి త్వరలోనే పార్టీలో చేర్చుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఆయన కూడా వైసీపీ ఆఫర్ కు ఓకే చెప్పినట్టు తెలిసింది.
ఉత్తరాంధ్రకు చెందిన కొందరు కీలక నేతలు కూడా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిసెంబర్ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ స్పీడ్ ను చూస్తే 2023 మార్చి తర్వాత ఎప్పుడైనా ముందస్తు పోల్ జరుగవచ్చునని చాలా మంది ఊహిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే మెరుగైన నేతలను ఎన్నికల కార్యక్షేత్రంలో దించడానికి జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థులకు ఆ మంచి నేతలను పోకుండా ఇప్పటి నుంచే చేజిక్కించుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇక చంద్రబాబు 15 రోజులకు ఒకసారి ఏపీలో పర్యటిస్తూ వారానికి ఒకసారి మీటింగ్ నిర్వహిస్తున్నారు.
ప్రతిపక్షాలు సర్దుకోకముందే 2023 మార్చిలోపే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. కీలక నేతలను పార్టీలో చేర్చుకొని ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేయాలని స్కెచ్ గీసినట్టు సమాచారం. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేనప్పుడే వెళ్లి విజయం సాధించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read:Bandi Sanjay: ఇలా చేస్తే బండి సంజయ్ భద్రతకు ముప్పే