రెండు రోజుల కిందట ప్రతిపక్ష నేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి గంట సేపు వివిధ అంశాలపై చర్చించినారు. ప్రభుత్వంపై 14 పేజీల లేఖను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు అందజేశారు. ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఎజెండాగా బాబు గవర్నర్ ను కలిశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ను రెండు రోజుల వ్యవధిలోనే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?
ముఖ్యమంత్రి జగన్ రాజ్ భవన్ లో గవర్నర్ ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివరించారు. శాసన సభలో బడ్జెట్ సమావేశాల్లో నెలకొన్న పరిస్థితిని గవర్నర్ దృష్టికి తెచ్చారు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించకుండా నిరవధికంగా వాయిదా వేయడం, టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడి చేశారని గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. అసెంబ్లీలో ఆమోదించిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, సహా మరో మూడు బిల్లులను శాసన మండలి ఆమోదించక పోవడాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చారని తెలిసింది.
అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు
అదేవిధంగా ఇ.ఎస్.ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, బిఎస్ – 3 వాహనాల కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, అతని తనయుడు లను అరెస్ట్ చేసిన అంశంపై పూర్తి వివరాలను గవర్నర్ కు సీఎం వెల్లడించారని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల జరిగిన తీరు, వైసీపీ అభ్యర్థుల విజయం, టీడీపీ అభ్యర్థి ఓటమి, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికవడం వంటి విషయాలను సీఎం గవర్నర్ క్ వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది.