https://oktelugu.com/

సీనియర్లు ఔట్.. జగన్ భారీ మంత్రివర్గ ప్రక్షాళన?

అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్‌ దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. అదే దూకుడుతో వరుస ఎన్నికల్లోనూ సత్తా చాటుతున్నారు. అదేటైమ్‌లో ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు.అయితే.. ప్రత్యర్థి పార్టీల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతలకే ఈ రిజల్ట్ ఎసరు పెట్టేలా ఉందన్న చర్చ నడుస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలో 151 స్థానాలు, పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మున్సిపాలీటీల్లో 99 శాతం, కార్పొరేషన్లలో వంద శాతం ఫలితం. ఇదీ ప్రస్తుతం వైసీపీ […]

Written By: , Updated On : April 5, 2021 / 10:25 AM IST
Follow us on

Jagan
అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్‌ దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. అదే దూకుడుతో వరుస ఎన్నికల్లోనూ సత్తా చాటుతున్నారు. అదేటైమ్‌లో ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు.అయితే.. ప్రత్యర్థి పార్టీల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతలకే ఈ రిజల్ట్ ఎసరు పెట్టేలా ఉందన్న చర్చ నడుస్తోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలో 151 స్థానాలు, పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మున్సిపాలీటీల్లో 99 శాతం, కార్పొరేషన్లలో వంద శాతం ఫలితం. ఇదీ ప్రస్తుతం వైసీపీ గ్రాఫ్‌. వైసీపీ సక్సెస్‌ కూడా.

ఇక ప్రజల్లో పార్టీపై వంద శాతం నమ్మకం ఏర్పడడంతో.. ఇక సొంత పార్టీ నేతలను రఫ్పాడించే కార్యక్రమం చేపడుతారన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అక్కడక్కడ నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఇంకా ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో వైసీపీలో రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఇప్పటి వరకూ వీటన్నింటిపై జగన్‌ మౌనంగానే ఉండిపోయారు. కానీ.. త్వరలోనే ఈ నియోజకవర్గాల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఆ నిర్ణయం కూడా కఠినంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని, మిగిలిన వారు ఇష్టం లేకుంటే పార్టీని వీడి వెళ్లవచ్చన్న సంకేతాలను సైతం జగన్ త్వరలో ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఇక నిన్నమొన్నటి వరకూ మంత్రి వర్గ విస్తరణలో పెద్దగా మార్పులేవీ ఉండవని భావించారు. అయితే.. జగన్ మాత్రం పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంత్రివర్గ విస్తరణలో భాగంగా సీనియర్‌‌ మంత్రులు కొందరు తమ పదవికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమాతో ఉన్నారు. కానీ.. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్‌‌, చైర్మన్‌ ఎంపికలో జగన్‌ ఎలాంటి వైఖరి అవలంబించారో వారు రుచిచూశారు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, మరోసారి మరొకరికి అవకాశం ఇవ్వాలని నాడే చెప్పానని, అందుకే గౌరవంగా తప్పుకోవాలని జగన్ స్వయంగా కొందరు సీనియర్ మంత్రులకు సూచించే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ తో టీడీపీ సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీ నేతలు మాత్రం ఈ రిజల్ట్ ఎందుకొచ్చాయిరా బాబూ? అంటూ తలలు పట్టుకుంటున్నారట.