YSRCP Plenary Meeting: ‘మీరేం చేస్తారో తెలియదు. టీడీపీ మహానాడు కంటె రెట్టింపుగా వైసీపీ ప్లీనరీ ఉండాలి. భారీగా జన సమీకరణ చేయండి. మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాలకు ప్లీనరీతో ఫుల్ స్టాప్ పడాలి. అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ప్రజలు ముఖం చాటేస్తున్నారని విపక్షం ప్రచారం చేస్తోంది. దీనిని తిప్పికొట్టేలా ప్లీనరీని విజయవంతం చేయాలి’..అంటూ సీఎం జగన్ పార్టీనేతలకు హితబోధ చేస్తున్నారు. టీడీపీ నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ అవ్వడంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో నిర్వహించబోయే ప్లీనరీ ప్రతిపక్ష పార్టీ ఉహాకి అందని రీతిలో చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు రావడం లేదని ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తోంది. దీంతో ఈ ప్లీనరీని గ్రౌండ్ సక్సెస్ చేసి ప్రజల్లో తమ పార్టీకి ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో నిర్వహించబోయే ప్లీనరి గ్రాండ్ సక్సెస్ చేసే బాధ్యతను పార్టీలో కొంత మంది కీలక నేతలకు అప్పగించినట్లు సమాచారం. మరో వైపు ప్లీనరీ వేదికగా జగన్ కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లోలోపల భయం..
వరుస ఎన్నికలతో ప్రజాభిమానం చూరగొన్నామని బయటకు గంభీరంగా ఉన్న అధికార వైసీపీలో మాత్రం లోలోప ఓటమి భయం వెంటాడుతోంది. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజలకు నగదు పంచిపెట్టినా అభివ్రుద్ధి మాత్రం శూన్యం. అందుకే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమైంది. దీనికి విపక్షాలు తోడయ్యాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరుపై విమర్శలు, వ్యాఖ్యానాలు ట్రోలింగ్ అవుతున్నాయి. దీనిపై అధికార పక్షం కలవరపాటుకు గురవుతోంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్రచారాలన్నింటికీ ప్లీనరీతో సమాధానం చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత ఉన్నా ఈ ప్లీనరీ వేదికగా వాటిని తొలిగించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని నవంబర్ లో అసెంబ్లీని రద్దు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే జగన్ ఇప్పటివరకు అన్నింట్లోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారని పార్టీ శ్రేణులంటున్నాయి.
Also Read: Agneepath Scheme Protest: ‘అగ్ని’కి ఆజ్యం పోస్తున్నదెవరు.. దేశమంతా ఎందుకీ నిరసనలు
ముందస్తు ఎన్నికలకే..
ఇప్పటికే జగన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేవలం ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వీటిని అమలుచేశారని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, గడపగడపకు మన ప్రభుత్వం.., ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొత్త బాధ్యతలు, దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ వర్గాల బోగట్టా. అయితే త్వరలో జరగబోయే పార్టీ ప్లీనరీని కూడా ఇందుకే జగన్ ఉపయోగించుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ప్లీనరీ వేదికగా రాజకీయ వ్యాఖ్యలకు తక్కువ అవకాశం ఇచ్చి ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన పనులు.., మళ్లీ అధికారంలోకి వస్తే రాబోయే కొత్త పథకాలకు సంబంధించి జగన్ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఇప్పటికే అధికాపార్టీ నేతల్లో ఎవరిమీదైన స్థానికంగా వ్యతిరికత ఉందని భావిస్తే పబ్లిక్ గానే సదరు నేత లేదా ఎమ్మెల్యేకి క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే ఆయా నేతల స్థానంలో బరిలో దించబోయే కొత్త నేతలను కూడా ప్లనరీ వేదికగా ప్రకటిస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు అభివృద్దికి సంబంధించి ఇప్పటి వరకు వస్తోన్న విమర్శలకు కూడా జగన్ సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రజాభిమానం కోసం..
రాష్ట్రంలో తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో జగన్ ఆరోపిస్తున్నారు. దానిని రాజకీయ అడ్వంటేజ్ గా ఉపయోగించుకోవడానికి ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలో ఉంటే వచ్చే పరిస్థితులు, పరిణామాలు కూడా జగన్ వివరించే ప్రయత్నం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తనకు వీలుంటుందని రాబోయే కొత్త పథకాల వివరాలు ప్లీనరీలో వివరించే అవకాశం ఉందని అంటున్నారు పార్టీలో కొంత మంది నేతలు. దీంతో పాటు వచ్చే ఎన్ని కల్లో మీకు పని చేయని నేతలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తానని ప్లీనరీలోనే జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
Also Read:Agnipath Scheme: ఉక్రెయిన్ ప్రేరణగానే అగ్ని పథ్ పుట్టిందా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Cm jagan key announcements as ysrcp plenary meeting
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com