CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒప్పటి తమిళనాడును తలపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తన ఓటమికి తానే బాటలు వేసుకుంటున్నట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమళినాడు తరహాలో గతంలో డీఎంకే, ఏఐడీఎంకే మధ్య కక్ష్యసాధింపు రాజకీయాలు జరిగేవి. ఒకరు అధికారంలోకి వచ్చాక, ప్రతిపక్షంలో ఉన్నవారిపై దాడులు చేసేవి. ఇదే తరహాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాడులు చేయకపోయినా అసెంబ్లీ వేదికగా, అధికారికంగా ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారు. తన తండ్రిపేరును సంస్థలకు పెట్టాలన్న ఆలోచనతో ఇదివరకే ఉన్న పేర్లు మార్గడంపై ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతోంది. తాజాగా జగన్ ప్రభుత్వం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేసింది. దీనికి గతంలో క్యాబినెట్ ఆమోదం తెలుపగా, అసెంబ్లీ బుధవారం ఓకే చెప్పింది.

పేరు మార్పుకు కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ రచ్చకు తెరలేపింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి జగన్ సర్కార్ డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చింది. ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది కూడా.. ఈ నిర్ణయంపై తెలుగు దేశం నేతలతోపాటు.. ఇతరులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్మోహన్రెడ్డి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో తనను తాను ప్రశ్నించుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నానన్నారు.
Also Read: Punjab Prisons: జైల్లో ఖైదీలకు దాంపత్య జీవితం: ఆ రాష్ట్ర జైళ్ళ శాఖ ఆలోచన మామూలుగా లేదుగా
డాక్టర్ లేదని పేరు మార్చారట..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరులోనే డాక్టర్ ఉంది. ఇప్పటికే యూనివర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరలో డాక్టర్ లేదట. పేరు మార్చడానికి దీనిని మొదటికారణంగా చెప్పారు సీఎం జగన్. వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన సీఎం వైఎస్సార్. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం పేదల అందుతోంది. ఈ రోజులు పేదలకు ధైర్యంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారు అంటే అందుకు కారణంనాడు వైఎస్ పెట్టిన పథకాలే కారణం అని మరో కారణం చెప్పారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది అని తెలిపారు.
పేరు మార్పుపై సర్వత్రా విమర్శ..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీతోపాటు తెలంగాణలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడు కాదని ఎవరూ అనడం లేదు. జగన్ తీసుకున్న నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నారు. తనయుడిగా జగన్ తన తండ్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరును ఏదైనా సంస్థలకు పెట్టాలనుకుంటే ఆ సంస్థలు తాను స్థాపించినవై ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని పేర్కొంటున్నారు. తన తండ్రి పేరు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
వైఎస్సార్ కంటే సీనియర్, ఆయనకంటే ఎక్కువ కాలం సీఎం..
నందమూరి తారక రామారావు ఈపేరు చెబితేనే తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకు వస్తుంది. రాజకీయాలు పక్కన పెడితే.. ఎన్టీఆర్ తెలుగువారి దేవుడు. రాముడిని, కృష్ణడిని తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌లోనే చూసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాడు పేదలకు ఎంతగానో అండగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం స్వల్ప మార్పులతో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. మద్యపాన నిషేధం అమలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కూడా తన సంక్షేమ పాలనతో ఆదర్శంగా నిలిచారు. అందరూ రాజన్న రాజ్యం కావాలి అనేలా పాలన సాగించారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ సరుకులు, ఫీజు రయింబర్స్మెంట్ తదితర పథకాలు ప్రవేశపెట్టారు. పోడు రైతులకు పట్టాలు ఇచ్చారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలు ఇచ్చారు. వైఎస్సార్ పథకాల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ఆయనను రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఎన్టీఆర్, వైఎస్సార్ పాలనతో ఎవరికి వారే సాటి. వైఎస్సార్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ యూనివర్సిటకి ఆయన పేరు పెట్టారు. కానీ ఇప్పుడు జగన్ సర్కర్ ఎన్టీఆర్ పేరులో డాక్టర్ లేదన్న కారణంగా తన తండ్రి పేరులో డాక్టర్ ఉందన్న కారణంతో పేరు మార్చడం విమర్శలకు తావిస్తోంది.

జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన వల్లభనేని వంశీ..
టీడీపీ టికెటపై పోటచేసి జగన్‌కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తొలిసారి.. ప్రభుత్వం తీరును తప్ప పట్టారు.. ఆ నిర్ణయం సమర్ధనీయం కాదంటూ.. వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అసెంబ్లీ వేదికగానే తన నిరసన తెలిపారు. హెల్త్ యూనివిర్సిటీ కోసం ఎంతో కష్టపడ్డ.. ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అని.. కానీ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేయడం సమంజసం కాదన్నారు.
కొడాలి నాని సైలెంట్..
యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే.. కొడాలి హౌస్‌లోనే ఉన్నారు. ఆయనకు కూడా జగన్ నిర్ణయం నచ్చలేదని నాని అనుచరులు చెబుతున్నారు. నిర్ణయం తప్పే అయినా.. కావాలనే మౌనం వహించారని పేర్కొంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మౌనంగా ఉన్నారు.
యార్లగడ్డ రాజీనామా..
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్సార్ ఎంతటి గొప్ప వ్యక్తో ఎన్టీ.రామారావు కూడా అంతే గొప్ప వ్యక్తి అని తెలిపారు. ఆయన పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. . ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను ప్రకటించారు.
స్పందించని లక్ష్మీపార్వతి..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పటి వరకు స్పందించలేదు. ఎమ్మెల్యే ఆమె సభలో లేకపోయినా వైసీపీ సర్కార్ నిర్ణయం తప్పకుండా ఆమెను నొప్పించి ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. తప్పకుండా ఆమె స్పందిస్తారని ఆశిస్తున్నారు.
తపుప పట్టిన బీజేపీ..
వైసీసీ నిర్ణయానిన టీడీపీ తప్పు పట్టడం సహజమే. అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన కూడా తెలిపారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సైతం ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయంపై మండిపడ్డారు. ఎవరైనా వ్యక్తులు పేర్లు మార్చగలరు కానీ.. చరిత్రను మార్చలేరని మండిపడ్డారు. ఇలా పేర్లు మారుస్తూ ఎంతకాలం నిరంకుస పాలన కొనసాగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి కొడాలి నాని.. లక్ష్మీ పార్వతి స్పందించాలని డిమాండ్ చేశారు.
Also Read: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్.. కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!
[…] Also Read: CM Jagan: ఓటమికి బాటలు వేసుకుంటున్న జగన్!! […]