
గ్రామ పంచాయతీ, మండల, జిల్లాపరిషత్, మున్సిపల్ సంస్థల ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్, నెల రోజుల్లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా ఎన్నికల్లో ఎటువంటి అవినీతి జరగకూడదని, నగదు, మద్యం పంపిణీని పూర్తిగా నిరోధించాలని పోలీసులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా అనర్హత వేటు వేస్తామని.. రెండు, మూడేళ్లు వారికి జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీలు నగదు, మద్యాన్ని అరికట్టాలని.. స్థానిక ఎన్నికలను పోలీసు యంత్రాంగం ఛాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సీఎం ఆదేశించారు.