ఏపీ ముఖ్యమంత్రి జగన్ హామీల అమలుపై దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టారు. సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎంత ఖర్చవుతుంది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గాల వారీగా లెక్కలు వేస్తున్నారు.
పాదయాత్ర సమయంలో..
జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు పాదయాత్ర సమయంలో ప్రతి నియోజకవర్గానికి హామీలిస్తూ వచ్చారు. దీంతో ప్రజలు జగన్ ను సీఎం చేశారు. దీంతో హామీల అమలుపై చొరవ తీసుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు 3800 కిలోమీటర్ల దూరం సుమారు 120 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గానికి పలు హామీల వర్షం కురిపించారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
వ్యయంపై అంచనా
జగన్ హామీల అమలుకు ఎంత మేర ఖర్చవుతుంది అనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏఏ నియోజకవర్గాల్లో ఎంత మేర బడ్జెట్ అవసరమవుతుంది? వేటికి ప్రాధాన్యమివ్వాలి అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై చొరవ తీసుకుంటూ హామీల అమలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యేల అభిప్రాయాలను..
హామీల అమలులో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత అంశాలను తీసుకుని వాటిని తీర్చాలని భావిస్తున్నారు. బడ్జెట్ పై కూడా అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం పనుల నిర్వహణపై ముందుకు కదులుతోంది. ప్రాంతాల వారీగా ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసింది. ప్రతి శాఖకు అయ్యే వ్యయంపై నివేదికలు పంపాలని ఆదేశించింది. దీంతో హామీల అమలు ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.