Andhra Pradesh floods: ఆంధ్రప్రదేశ్ లో వరద ముంపుతో ప్రజలు అల్లాడిపోయారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు కట్టు బట్టలతో బయటకు వెళ్లిపోయారు. బతుకు జీవుడా అంటూ అన్నమో రామచంద్రా అని అలమటించారు. విపత్తుతో ప్రజలు కకావికలం అయిపోయారు. రాయలసీమలో ఇంతటి ఘోరాన్ని చూడాలేదని ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు.

దీనిపై శాసనసభలో కూడా చర్చ జరిగింది. వరద ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ జవాబిచ్చారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తాను వెళ్లకున్నా సేవా కార్యక్రమాలు జరగడంపై పెదవి విప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని చెప్పుకొచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఎందుకు పర్యటించలేదని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను వెళితే సహాయ కార్యక్రమాలు ఆగిపోయేవని, తాను సమీక్ష చేస్తే అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ముమ్మరంగా పనులు చేశారని గుర్తు చేశారు. ఒకవేళ నేను పర్యటనకు వెళితే పనులన్ని పక్కన పెట్టి నా వెంటే ఉంటారని చెప్పారు. ఇప్పడు నేను వెళ్లడం కరెక్టా? అధికారులు వెళ్లడం సమంజసమా? అని ప్రశ్నించారు.
Also Read: 60 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు ఇది..! సీమలో భారీ నష్టం..

అధికార యంత్రాంగం కూడా అహర్నిశలు శ్రమించినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంద. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలు అనేకంగా ఉంటున్నాయి. దీంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా ఇంకా పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాలు కోలుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం మరింత చురుకుగా వ్యవహరించి ప్రజల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది.
Also Read: ప్రకృతి వైపరీత్యం కాదు.. ప్రభుత్వ వైఫల్యమే! వరద బాధితుల వద్దకు పవన్