https://oktelugu.com/

స్వరం మార్చిన జగన్‌.. కేంద్రంపై దూకుడు

ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్రం పట్ల మెతకవైఖరితోనే ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా జగన్ గానీ.. ఆయన టీమ్‌ గానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. కేంద్రం తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకు కూడా మద్దతు తెలిపారు. కేంద్రం అవును అంటే అవును అన్నారు.. కాదు అంటే కాదు అన్నారు. కానీ.. అదేంటో ఈ మధ్య వైసీపీ తన వైఖరీ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు తమ స్వరం మార్చారు. కేంద్రంపై డైరెక్ట్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2021 12:29 pm
    Follow us on

    CM Jagan
    ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్రం పట్ల మెతకవైఖరితోనే ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా జగన్ గానీ.. ఆయన టీమ్‌ గానీ పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. కేంద్రం తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకు కూడా మద్దతు తెలిపారు. కేంద్రం అవును అంటే అవును అన్నారు.. కాదు అంటే కాదు అన్నారు. కానీ.. అదేంటో ఈ మధ్య వైసీపీ తన వైఖరీ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలు తమ స్వరం మార్చారు. కేంద్రంపై డైరెక్ట్‌ అటాక్‌కు దిగుతున్నారు.

    కేంద్రం ఇవ్వకపోయినా తామిస్తున్నాం.. పోలవరానికి కేంద్రం నిధులివ్వట్లేదు.. కేంద్రం సహకరించడం లేదు.. ఏపీకి అన్యాయం చేస్తున్నారు.. అంటూ ఈ మధ్య వైసీపీ నేతల నోట ఈ మాటలు వింటున్నాం. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడానికి ది బెస్ట్ అన్న పద్ధతితో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో తన వైఫల్యాలన్నింటికీ కేంద్రాన్ని కారణంగా చూపించడం ప్రారంభించారు. కేంద్రం అనేక ఆంక్షలు పెట్టి వైఎస్‌ఆర్‌‌ బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందని చెప్పుకొచ్చారు. నిజానికి కేంద్రం పెట్టిన నిబంధనలు అమలు చేయలేనివేమీ కావు. కానీ.. జగన్ కేంద్రంపై నిందలేస్తున్నారు.

    కానీ.. జగన్‌ కూడా ఇటీవలి కాలంలో రాజకీయాన్ని కాస్త మార్చుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి సందర్భంలోనూ గతంలో బీజేపీని పల్లెత్తు మాట అనడానికి ఆయన పార్టీ నేతలకు పర్మిషన్లు ఇవ్వలేదు. ప్రెస్‌మీట్లలో ఏం మాట్లాడాలన్నా.. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సూచనల మేరకే మాట్లాడాలన్న స్పష్టమైన కట్టుబాటు వైసీపీలో ఉంది. ఆ ప్రకారం బీజేపీపై ఎవరూ నోరు మెదపలేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం బీజేపీ నేతలపై రాజకీయంగా విరుచుకుపడ్డారు. అయితే.. విధాన పరంగా ఎప్పుడూ ప్రశ్నించలేదు. రాజకీయం కోసం ఏపీలో కొన్ని ప్రకటనలు చేసినా ఢిల్లీలో మాత్రం కనీసం ప్రకటనలు కూడా చేయరు. కానీ.. ఇప్పుడు విధాన పరంగా విమర్శలు సైతం చేస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ కూడా ఇందులో భాగం కావడం చర్చకు దారితీసింది.

    సీఎం జగన్‌ కేంద్రం తీరుపై అసంతృప్తిగా ఉన్నారనేది వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్డీయేలో ఉన్న పార్టీలు కూడా ఇవ్వనంత సహకారం బయటి నుంచి వైసీపీ ఇస్తున్నా.. తమకు మాత్రం ఆశించినంత సహకారం కేంద్రం ఇవ్వడం లేదనేది వారి అభిప్రాయం. అయితే ఈ సహకారం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు.. ప్రాజెక్టులు మాత్రమే కాదు.. ఇటీవల.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ నియామకం విషయంలోనూ.. కేంద్రం తీరుపై జగన్ అసహనానికి గురయ్యారని వైసీపీ వర్గాలు కొన్ని మీడియాకు లీక్ చేశాయి. ఇన్నాళ్లు మెతకవైఖరితో ఉన్నామని.. ఇప్పుడు దానిని పక్కన పెట్టి పోరాడాలన్న పంథా వైసీపీలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరింత దూకుడు పెంచి మరింత విరుచుకుపడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్