https://oktelugu.com/

తెలంగాణకు మొండిచేయి.. ఆ రాష్ట్రానికి వరం

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో రకాల హామీలు ఇస్తుంటుంది. ఎంతవరకూ ఆ ఎన్నికల నుంచి బయటపడే మార్గాన్నే అన్వేషిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రాజకీయాలు అల్లుతుంటుంది. అవి అమలు సాధ్యమా..? కాదా..? అనేది ఆలోచించదు. ప్రజలను సైతం ఆ స్థాయిలో టెమ్ట్‌ చేస్తుంటుంది. దటీజ్‌ బీజేపీ అనుకునేలా ఆలోచనలో పడేస్తుంటుంది. వేరే రాష్ట్రంలో అమలు కాని హామీని.. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రంలో అమలు చేస్తానంటుంది. ఇందుకు ఉదాహరణే పసుపు బోర్డు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 1, 2021 / 12:41 PM IST
    Follow us on


    ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో రకాల హామీలు ఇస్తుంటుంది. ఎంతవరకూ ఆ ఎన్నికల నుంచి బయటపడే మార్గాన్నే అన్వేషిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రాజకీయాలు అల్లుతుంటుంది. అవి అమలు సాధ్యమా..? కాదా..? అనేది ఆలోచించదు. ప్రజలను సైతం ఆ స్థాయిలో టెమ్ట్‌ చేస్తుంటుంది. దటీజ్‌ బీజేపీ అనుకునేలా ఆలోచనలో పడేస్తుంటుంది. వేరే రాష్ట్రంలో అమలు కాని హామీని.. ఎన్నికల జరుగుతున్న రాష్ట్రంలో అమలు చేస్తానంటుంది. ఇందుకు ఉదాహరణే పసుపు బోర్డు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర నాయకులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఎన్నో రకాల రెక్వెస్టులు కూడా పెట్టారు. అది సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. కానీ.. మొన్న తమిళనాడులో ప్రచారానికి వెళ్లిన బీజేపీ బడా నేతలు తమిళనాడులో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు పుదుచ్చేరిలో ఏకంగా ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చేస్తున్న పోరాటాన్ని అందరం చూస్తూనే ఉన్నాం.

    తాజాగా.. బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను చూసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకు ఇప్పటికే తెర వెనుక రాజకీయాలు పూర్తి చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మొత్తంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగానే అక్కడ పాలన సాగించారు.

    ఇప్పుడు అక్కడ నేరుగా తమ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు మోడీ, షాలు. తరచూ అక్కడ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. అది సరిపోలేదేమో కానీ.. పుదుచ్చేరి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఏకంగా ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడా హామీ వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదని.. ఇచ్చేది కూడా లేదని కేంద్రం చెబుతోంది. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పుదుచ్చేరికి ఈ హామీ ఎందుకు ఇచ్చిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

    తెలంగాణకు పసుపుబోర్డు ఇస్తామని బీజేపీ పెద్దలందరూ వచ్చి నిజామాబాద్‌లో ప్రచారం చేశారు. ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీనిపై రాజకీయ రగడ ఏర్పడుతోంది. కానీ.. తమిళనాడులో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ రాజకీయ రచ్చ అయింది. బీజేపీ అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు.. ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. తమ హామీల్ని నెరవేర్చేలా.. సొంత పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. మొత్తానికి ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని ప్రజల్ని మభ్య పెట్టడం ఎలాగో బీజేపీ నేతలు చేసి చూపిస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్