CM Chandrababu : కొందరి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఉన్న వారి విషయంలో చెప్పనవసరం లేదు. సానుకూలతలు ఉంటాయి. ప్రతికూలతలు ఉంటాయి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కాస్తా భిన్నం. ఆయన రాజకీయ పార్టీ నేతగా కంటే పాలనా దక్షుడిగానే గుర్తింపు సాధించారు. చాలా సందర్భాల్లో ఇది స్పష్టమైంది. ఆయన పనితీరును బ్యూరోక్రసీ వ్యవస్థ ఇష్టపడుతుంది. దేశవ్యాప్తంగా ఆయనకు ఈ విషయంలో మంచి పేరు ఉంది. తాజాగా ఈ విషయం మరోసారి బయటపడింది.
Also Read : భారత్‌లో ఊబకాయం.. భవిష్యత్ ప్రమాద ఘంటికలు
* అధికారిగా పదవీ విరమణ..
చాలామంది అధికారులు తమ పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తారు. వచ్చి కీలక స్థానాలకు చేరుకుంటారు. అలా కేంద్రమంత్రి అయ్యారు హరిదీప్ సింగ్( Hardeep Singh). మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీగా ఎన్నికైన హరిదీప్ సింగ్.. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. స్వతంత్ర హోదా కలిగిన నగర వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబు పార్లమెంట్ హాల్ కు వచ్చారు. ఆ సమయంలో హరిదీప్ సింగ్ ముందుకు వచ్చారు. సార్ నేను.. హర్దీప్ సింగ్. కేంద్రంలో మంత్రిని. నేను మీ అభిమానిని. బ్యూరోక్రాట్ గా ఉన్నప్పటి నుంచి మీ గురించి వింటూనే ఉన్నా. సార్ ఒక సెల్ఫీ అంటూ రిక్వెస్ట్ చేసి.. చంద్రబాబుతో ఫోటో తీసుకుని వినయంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
* 30 ఏళ్ల పాటు అధికారిగా..
హరదీప్ సింగ్ కేంద్ర సర్వీసులో 30 ఏళ్ల పాటు కొనసాగారు. ఇండియన్ ఫారెన్ సర్వీసులో( Indian Foreign Service) మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. దాదాపు 100 దేశాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఎంతోమంది అంతర్జాతీయ నేతలను చూశారు. ఐక్యరాజ్యసమితిలోనూ సెక్యూరిటీ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా పని చేశారు. అటువంటి వ్యక్తికి చంద్రబాబు అపూర్వంగా కనిపించారు అంటే.. చంద్రబాబు రేంజ్ ఏ స్థాయిలో ఉందో గుర్తించుకోవాలి. ఎంతోమందిని చూశాను.. మీలాంటి నాయకుడు లేడు అని ఓపెన్ గానే అనడాన్ని ఏమనుకోవాలి. దట్ ఈజ్ చంద్రబాబు. బాబు ఆలోచన లు అర్థమైన వాళ్ళు, వాటి ప్రభావాన్ని ఊహించిన వాళ్ళు ఇలాగే ఫ్యాన్స్ అయిపోతారు అంటూ టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. అది విపరీతంగా వైరల్ అవుతుంది.
* జాతీయస్థాయిలో అభిమానులు..
చంద్రబాబుకు జాతీయస్థాయిలో( National wide ) ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయంగానే కాకుండా ఆయన విజన్ అభిమానించిన వారు చాలా ఉన్నారు. ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది కూడా. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు వెళితే ఏపీ అంటే ముందుగా అక్కడి ప్రజలు గుర్తు చేసుకునే పేరు చంద్రబాబు. అంతటి బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు బాబు. కానీ ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. కానీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా అభిమానిస్తుంటారు కూడా. ఇప్పుడు ఏకంగా ఒక కేంద్రమంత్రి ఓపెన్ గానే తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం విశేషం.
Also Read : వక్ఫ్ బిల్లుతో జెడియు మూల్యం.. మరి టిడిపి పరిస్థితి ఏంటి?