Jaggareddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత అయినా అందరూ ఒక్కటిగా ఉంటారని అనుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు. కాగా, సొంత పార్టీలోనే నేతల మధ్య విభేదాలు ఇంకా ఎక్కువయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ క్రమంలోనే తన దైన బాటలో నడుస్తున్నారు.

పార్టీ నిర్ణయాలకు లోబడకుండా తన సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగుతున్నాడు. అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఒక్కడిగానే పోరాడేందుకుగాను ఒక్కడిగా ముందుకు సాగుతున్నాడు. అలా ప్రతీ రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు. గతంలో ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలనే డిమాండ్ తో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాడు. ఈ సారి కూడా అటువంటి ప్రోగ్రాం పెట్టగా, సీఎల్పీ ఆ ప్రోగ్రాంను రద్దు చేసుకునేలా చేసింది. ఎలాగంటే…
Also Read: బిగ్ అప్డేట్.. ‘NTR30’ లాంచింగ్ డేట్ ఫిక్స్?
17న తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని జగ్గారెడ్డి కోరారు. ఆ రోజున తాను అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ప్రగతి భవన్ వద్ద దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాడు. కాగా, సీఎల్పీ ఆ డెసిషన్ ను బ్రేక్ చేసింది. సంక్రాంతి పర్వదినాన జూమ్ మీటింగ్‌లో ..ఉమ్మడి పోరాటం చేయాలని, జగ్గారెడ్డి ఒక్కడే కాదని నిర్ణయించింది. అలా సీఎల్పీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి సీఎం కేసీఆర్ కు లేఖరాయాలని డిసైడ్ చేశారు.
సీఎం కేసీఆర్ ను కలిసి సమస్యలు వివరించాలని, అలా పోరాటం చేయాలని కోరారు. ఒకవేళ సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ఉమ్మడిగా పోరాటం చేయాలని డిసైడ్ చేశారు. దాంతో జగ్గారెడ్డి ఆ నిర్ణయానికి అంగీకరించాల్సి వచ్చింది. అలా సీఎల్పీ నేతృత్వంలో 18, 19 తేదీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయనున్నారు నేతలు. మొత్తంగా జగ్గారెడ్డిని కంట్రోల్ చేసేందుకుగాను సీఎల్పీలో వ్యూహాలు రచించుకుంటున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వడగళ్ల వాన వలన మిర్చి రైతుల నష్టాలు, దెబ్బతిన్న పంట నష్టంపైన అంశాలను సీఎల్పీ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. జగ్గారెడ్డిని కలుపుకుని అలా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన పోరుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది.
Also Read: టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడంపై రోహిత్ శర్మ స్పందన ఇదే…
[…] KTR: టీఆర్ఎస్ భావినేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కేటీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే కేటీఆర్ త్వరలో యూపీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారని టాక్. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకుగాను కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎస్పీ.. గెలుపు కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన వంతు పాత్ర పోషించాలని డిసైడ్ అయినట్లు వినికిడి. […]
[…] Puri Jagannath: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్రపంచంలోని వింతలను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘విపశ్యన’. దీని గురించి పూరి మాటల్లోనే.. […]