Clash Over Bheemla Nayak Movie Tickets: భీమ్లానాయక్ సక్సెస్ వేడుకలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ పై జనం ఎగబడుతున్నారు. కలెక్షన్ల సునామీని సృష్టించే దిశగా సినిమా దూసుకువెళ్తుంది. అయితే, పాల్వంచలోని వెంకటేశ్వర థియేటర్‌లో భీమ్లానాయక్ టికెట్స్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో కొత్తగూడెంకి చెందిన మధు అనే వ్యక్తి షరీఫ్ అనే యువకుడి గొంతు కోశాడు.
షరీఫ్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షరిఫ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మధును అరెస్ట్ చేశారు. అసలు భీమ్లానాయక్ టికెట్ల కోసం ఇలా యువకుడు గొంతు కోయడం చాలా దారుణం. ఒకవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో చింతించాలి.
Also Read: “భీమ్లా నాయక్” పై సినీ ప్రముఖుల ప్రసంసల వర్షం
మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ కాస్త వైల్డ్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అంటూ సాధారణ ప్రేక్షకులు కూడా విచారణ వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒక సినిమా టికెట్ కోసం ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తడం ఏమిటి ? ఈ గొడవలో కొత్తగూడెంకి చెందిన మధు అనే వ్యక్తి షరీఫ్ అనే యువకుడి గొంతు కోయడం ఏమిటి ?
ఏమిటి ఈ దరిద్రం ? పవన్ ఫ్యాన్స్ ఇప్పటికైనా మారితే మంచిది. ఇక సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు సాగర్ మిగతా టీమ్ అద్భుతంగా పని చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక రెండో రోజు కూడా అంతా భీమ్లానాయక్ ఊపే కనిపిస్తోంది.
మొత్తానికి ఈ సినిమా ప్రభావం ప్రేక్షకులపై బలంగా పడింది. భీమ్లానాయక్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని సినీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: భీమ్లానాయక్ రాజకీయం.. కేసీఆర్ అలా.. జగన్ ఇలా.. ఏంటీ రచ్చ..?