Homeఆంధ్రప్రదేశ్‌Gudivada Tension: గుడివాడ ఎందుకు భగ్గుమంది? వైసీపీ, టీడీపీ ఘర్షణ వెనుక ‘రంగా’ వర్ధంతి.. షాకింగ్...

Gudivada Tension: గుడివాడ ఎందుకు భగ్గుమంది? వైసీపీ, టీడీపీ ఘర్షణ వెనుక ‘రంగా’ వర్ధంతి.. షాకింగ్ నిజాలు

Gudivada Tension: వంగవీటి ఎవరివారు.. ఈ ప్రశ్నకు అందరి సమాధానం.. ‘కాపు సామాజికవర్గం’ వారేనని.. మరి ఈయన మరణానికి కారకులు ఎవరు అంటే అందరి వేళ్లు టీడీపీ వైపు చూపిస్తాయి.. వంగవీటి చనిపోయినా ఆయన రాజకీయం మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ఆయన జయంతి, వర్ధంతిల సందర్భంగా రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా గుడివాడ భగ్గుమనడం వెనుక కూడా ఇదే కారణం.. వంగవీటి వర్ధంతిని ఆయనను చంపిన టీడీపీ చేయడం ఏంటని వైసీపీ కొడాలి నాని బ్యాచ్ రంకెలేసింది. దాడులకు పురిగొల్పింది. కాపులను టీడీపీకి దూరం చేసే ఎత్తుగడ వేసింది. గుడివాడ ఎందుకు భగ్గుమంది? వైసీపీ, టీడీపీ ఘర్షణ వెనుక కథేంటన్న దానిపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Gudivada Tension
Gudivada Tension

మాచర్ల విధ్వంస ఘటన మరువక ముందే కృష్ణా జిల్లా గుడివాడలో కాక రాజుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు వైసీపీ నాయకులు ఫోన్ లో బెదిరింపులకు దిగడం సంచలనంగా మారింది. అటు టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు దాడులకు దిగారని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల వెనుక వైసీపీ కీలక నాయకుల హస్తం ఉందని ఆయన విమర్శించారు. సోమవారం వంగవీటి మోహన్ రంగా జయంతి ని ఘనంగా నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. టీడీపీ హయాంలో వంగవీటి దారుణ హత్యకు గురయ్యారని.. టీడీపీ గుండాలే ఆయన్ను అంతమొందించారని.. అటువంటప్పుడు టీడీపీ నాయకులకు ఆయన వర్ధంతి నిర్వహించే హక్కు లేదని గుడివాడ వైసీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

గుడివాడ టీడీపీ కార్యాలయం సమీపంలో రంగా వర్ధంతికి ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అక్కడ కార్యక్రమ నిర్వహణ వద్దంటూ కొందరు వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో మాటకు మాట పెరిగింది. సమాచారమందుకున్న ఇరు పార్టీల నాయకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను పంపించేశారు. అయితే వైసీపీ నాయకుడు కాళి నేరుగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చంపుతానని హెచ్చరించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అసభ్య పదజాలంతో దూషించారంటున్నారు. దీని వెనుక మాజీ మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో గుడివాడ ఉద్రిక్తంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్నట్టు పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.

Gudivada Tension
Gudivada Tension

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ధ్వజమెత్తారు. గుడివాడలో గెడ్డం గ్యాంగ్ ఆగడాలు పెరుగుతున్నాయని విమర్శించారు. త్వరలో వారి ఆగడాలకు చెక్ పడనుందని.. వారికి గుండు కొట్టించే రోజులు దగ్గర్లో ఉన్నాయని కామెంట్స్ చేశారు. గుడివాడ గొడవకు సంబంధించి వీడియో క్లిప్ ను జతచేసి ట్విట్టర్ లో పోస్టు చేశారు. తమ దగ్గర ఇంతకంటే పెద్ద రాళ్లే ఉన్నాయని హెచ్చరించారు. గట్టి హెచ్చరికలే పంపారు.

అయితే కోస్తాలో వరుస ఘటనలు పోలీసులకు సవాల్ గా మారాయి. అధికార పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడం, టీడీపీ బలపడుతుండడంతో ఎదురుదాడులు చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న పవన్ సత్తెనపల్లి టూర్ ను అడ్డుకునేందుకు మాచర్లలో అధికార వైసీపీ విధ్వంసానికి దిగిందని టాక్ నడిచింది. టీడీపీ నేతలను టార్గెట్ గా చేసుకుంటూ ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. ఆ ఘటన ఇంకా మరువకముందే ఇప్పుడు గుడివాడలో అటువంటి వాతావరణమే నెలకొనడంతో నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version