TDP Vs YCP: రాజకీయ దాడులతో పల్నాడు జిల్లా గురజాల మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఓ జాతరలో తలెత్తిన చిన్నపాటి వివాదం పెను దుమారానికి దారితీసింది. వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య కొట్లాటకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్సీ రగడ చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో అర్ధరాత్రి పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే వైసీపీ నేతలు టిడిపి శ్రేణులతో పాటు మీడియా ప్రతినిధులపై సైతం దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
పాతపట్నం అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పాటల కచేరి ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో రెండు పార్టీల శ్రేణుల మధ్య మాటా మాటా పెరిగి కొట్లాటకు దారి తీసినట్లు తెలుస్తోంది. అంతకుముందు తిరునాళ్ల సందర్భంగా టిడిపి, జనసేన నేతలు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. ఆ ఫ్లెక్సీ ని వైసిపి నేతలు తొలగించినట్లు టిడిపి,జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఇంతలో పాటల కచేరీలో రేగిన చిన్నపాటి వివాదం పెద్దదైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.
ఏటా అమ్మవారి తిరునాళ్ల వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల నాయకులు ఉత్సాహం కనబరిచారు. భక్తులకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే టిడిపి, జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరుణంలోనే వివాదాలు జరుగుతున్నాయి. పాటల కచేరి వద్ద పరస్పరం కవ్వింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒకరికొకరు నెట్టుకోవడంతో కొట్లాటకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ తరుణంలో భారీగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే కొట్లాటను వీడియో తీసే క్రమంలో మీడియా ప్రతినిధుల వద్ద ఉన్న కెమెరాలు వైసీపీ నేతలు లాక్కున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు సైతం నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.