ఏపీ, తెలంగాణ మధ్య సయోధ్య కుదిర్చిన ఎన్వీరమణ

తెలుగు స్టేట్ల జలవివాదానికి పరిష్కారం దొరకనుంది. కృష్ణా జలాల వివాదంపై ఇప్పటికే రెండు ప్రాంతాలు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ వీ రమణ సూచనపై అందరిలో ప్రశంసలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు స్వీకరించింది. కృష్ణా బోర్డును నోటిఫై చేసినందుకు […]

Written By: Srinivas, Updated On : August 2, 2021 7:04 pm
Follow us on

తెలుగు స్టేట్ల జలవివాదానికి పరిష్కారం దొరకనుంది. కృష్ణా జలాల వివాదంపై ఇప్పటికే రెండు ప్రాంతాలు కోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి చక్కని పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాస్తోందంటూ ఏపీ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ వీ రమణ సూచనపై అందరిలో ప్రశంసలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదనలు స్వీకరించింది. కృష్ణా బోర్డును నోటిఫై చేసినందుకు విచారణ అవసరం లేదని తెలంగాణ సర్కారు వాదించింది. గెజిట్ ఇప్పుడే అమల్లోకి రాలేని తెలుస్తోంది. సెప్టెంబర్ తరువాత వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటి నుంచే అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండు ప్రాంతాలకు చెందిన వాడినని సీజేఐ తెలిపారు. కృష్ణా జలాల వివాదంలో గతంలో కూడా వాదనలు జరిగాయని గుర్తు చేశారు. బుధవారం మరో ధర్మాసనం ముందుకు విచారణకు వస్తుందన్నారు.

ఎన్వీ రమణ పలు కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారానే కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఆకాంక్షించారు. చాలా వరకు కేసులు కూర్చుని మాట్లాడుకుంటేనే పరిష్కారం అయ్యాయని చెప్పారు. దీంతో రెండు తెలుగు ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిపితే సమస్య కొలిక్కి వస్తుందని పేర్కొన్నారు. జల వివాదాల అంశం సున్నితమైందని తెలిపారు. అందుకే ఇరువురు పాలకులు తమ సమస్యకు తామే పరిష్కారం కనుగొనాలని సూచించారు. వారి మధ్య సయోధ్య కుదిరితేనే సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే పలు విధాలా రెండు ప్రాంతాలు సమస్యతో బాధపడుతున్నాయి. రెండు ప్రాంతాల నాయకులు తమ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుండడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రజాప్రతినిధులు సైతం తమ నోరుకు పని చెప్పడంతో సమస్య జఠిలం అవుతోంది. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సూత్రప్రాయంగా రెండు ప్రాంతాల సమస్యకు చక్కని పరిష్కార మార్గం చూపించారని అందరు చెబుతున్నారు.