https://oktelugu.com/

Investigative Journlism : పరిశోధనాత్మక పాత్రికేయం అంతరించలేదు.. యాజమాన్యాలే చంపేశాయ్ సార్?

CJI NV Ramana on Investigative Journlism : పరిశోధనాత్మక పాత్రికేయం.. ఓ పదేళ్ల కిందటి వరకూ ఉండేది. సవివరంగా జర్నలిస్టులు వివరాలు సేకరించి కుంభకోణాలను, అవినీతి, అక్రమాలను వెలికితీసేవారు. ఈ కథనాలకు ప్రభుత్వాలే కుప్ప కూలిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మైనింగ్ పై ‘పెద్దలా గద్దలా’ అంటూ వేసిన ఈనాడు వరుస కథనాలు అప్పట్లో తెలుగు రాజకీయాలను షేక్ చేశాయి. ప్రభుత్వాలు కుప్పకూలిపోయేలా పరిశోధనాత్మక కథనాలను పత్రికల్లో వేసేవారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2021 4:54 pm
    Follow us on

    CJI NV Ramana on Investigative Journlism : పరిశోధనాత్మక పాత్రికేయం.. ఓ పదేళ్ల కిందటి వరకూ ఉండేది. సవివరంగా జర్నలిస్టులు వివరాలు సేకరించి కుంభకోణాలను, అవినీతి, అక్రమాలను వెలికితీసేవారు. ఈ కథనాలకు ప్రభుత్వాలే కుప్ప కూలిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మైనింగ్ పై ‘పెద్దలా గద్దలా’ అంటూ వేసిన ఈనాడు వరుస కథనాలు అప్పట్లో తెలుగు రాజకీయాలను షేక్ చేశాయి. ప్రభుత్వాలు కుప్పకూలిపోయేలా పరిశోధనాత్మక కథనాలను పత్రికల్లో వేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వారి కుంభకోణాలపై ఒకటి రెండు కాదు ఎన్నో వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటివి ఏవీ లేవు. కాదు పూర్తిగా అంతరించాయి. జర్నలిస్టుల సత్తా తగ్గిపోయిందని కొందరు.. వారు అమ్ముడుపోయారని మరికొందరు అంటున్నారు. నిజానికి అది తప్పు. జర్నలిస్టు జర్నలిస్టుగానే ఉన్నారు. కానీ ఈ రంగంలోకి రాజకీయ నాయకులు, స్వార్థపూరిత వ్యక్తులు, బిజినెస్ మ్యాన్ లు వచ్చి భ్రష్టు పట్టించారు. యాజమాన్యాల తీరుతో జర్నలిస్టులోని ‘జర్నలిజం’ చచ్చుబడిపోయింది.

    Investigative Journlism

    Investigative Journlism

    తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఓ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ‘మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం మాయమైంది’ అని జర్నలిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాన గార్డెన్ లో పూసే ప్రతి పువ్వూ ఇప్పుడు అందంగానే కనిపిస్తోంది’ అంటూ మీడియా తీరును కడిగేశాడు. సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల రచించిన పరిశోధనాత్మక బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆవేదనలో అర్థముంది. కానీ జర్నలిస్టులను ఇలా ఎందుకు పనికిరాని వారుగా చేసింది ఎవరన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది..

    ఒకప్పుడు వైఎస్ఆర్ ను ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఊపిరి ఆడనివ్వకుండా సంచలన కథనాలను వండివర్చేవి. కానీ ఇప్పుడు ఈనాడు ఈ సంచలనాలకు పూర్తిగా తిలోదకాలివ్వగా.. ఆంధ్రజ్యోతి అమవాస్యకో పౌర్ణమికో ఒకటి అరా కథనాలు ఇస్తోంది. ప్రభుత్వాన్ని షేక్ చేసే కథనాలు అయితే రావడం లేదు. ప్రభుత్వాలకు పత్రికలు, మీడియా భయపడిపోతున్నాయి. తమ కాళ్లకింద నేల కదిలిస్తారని జడుసుకుంటున్నాయి.

    ఇక దిగ్గజ మీడియాలన్నింటిని నయానో భయానో రాజకీయ పార్టీలు, వారి అనుంగ వ్యాపారవేత్తలు కొనేసి వారికి వ్యతిరేకంగా రాయకుండా చేసేసుకున్నారు. ఇక లొంగని వారిని వివిధ రకాలుగా లొంగదీసుకున్నారు. ఇక బాగా రాసే జర్నలిస్టులను పార్టీల నేతలు కొనేశారు. దీంతో ‘మీడియాలో ఇక పరిశోధనాత్మక జర్నలిజం’ అనేది ఎక్కడ వస్తుంది? ఎలా పుడుతుంది..?

    Also Read: తెలంగాణ ఉద్యమంలో తెరవెనుక ఏం జరిగింది.. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత విఠల్’ చెప్పిన సంచలన నిజాలు
    జర్నలిజం భ్రష్టు పట్టించింది ఖచ్చితంగా మీడియా యాజమాన్యాలే. కరోనా ధాటికి చాలా మంది సీనియర్ జర్నలిస్టులను సంస్థలు ఉద్యోగాల్లోంచి తీసేసి ఇంటికి పంపించేశాయి. ఈనాడును పట్టుకొని 40 ఏళ్లు ఉన్న కార్టూనిస్ట్ శ్రీధర్ లాంటివారు కూడా యాజమాన్యాల మొండి వైఖరితో ఉద్యోగానే మానేసిన పరిస్థితి. ఇలా దిగ్గజ జర్నలిస్టులు.. బాగా రాసేవారంతా ప్రత్యామ్మాయ మార్గాల వైపు మళ్లారు. చాలా మంది డిజిటల్ మీడియాలోకి వచ్చేశారు. జాతీయ చానెల్స్ తెలుగులోనూ వెబ్ సైట్స్ మొదలుపెట్టడంతో మంచి జీతాలకు చేరి వాటిని బలోపేతం చేస్తూ మంచి కథనాలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. అయితే ఇందులో పరిశోధనాత్మక కథనాలు ఏవీ ఉండవు. కేవలం సాధారణ గాసిప్ స్టోరీలే.

    ఇలా జర్నలిస్టులను ఎందుకు పనికిరాకుండా చేసినవి మీడియా యాజమాన్యాలు, పార్టీలు. ఇప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఎంత పరిశోధనాత్మక జర్నలిజం మాయమైందని మొత్తుకున్నా.. రాసేవారే లేరు. అయినా రాస్తానన్న యాజమాన్యాలు రాయించే స్థితిలో లేవు. సో మీడియాలో ఇక పరిశోధనాత్మక కథనాలు కష్టమే. కేవలం సాధారణ కథనాలే వస్తాయి. ఆ దుస్థితికి నిజంగానే మీడియాను దిగజార్చారు.

    Also Read: విజయ్ దివస్-1971 భారత్ పాక్ యుద్ధానికి 50 ఏళ్లు.. ఆరోజు ఏం జరిగిందంటే..?