సినిమా ఇండస్ట్రీకి గొప్ప శుభవార్త.. రేపటి నుంచి 100శాతం కెపాసిటీతో థియేటర్లు

కరోనా మహమ్మారితో అసలు థియేటర్లలో మళ్లీ సినిమాలు చూస్తామా? అభిమాన హీరో సినిమాకు కాగితాలు ఎగరవేస్తామా? ఈలలు, గోలలతో మునుపటిలా ఎంజాయ్ చేస్తామా? అన్న ఆందోళన అభిమానుల్లో ఉండేది. ఇన్నాళ్లు అన్నింటిని తెరిచిన కేంద్రం సమూహంగా కూర్చునే థియేటర్ల విషయంలో మాత్రం ఇంకా కండీషన్లు పెట్టింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో మూతపడ్డ సినిమా ఇండస్ట్రీకి కేంద్రం గొప్ప శుభవార్త చెప్పింది. మూతపడ్డ సినిమా […]

Written By: NARESH, Updated On : January 31, 2021 9:06 am
Follow us on

కరోనా మహమ్మారితో అసలు థియేటర్లలో మళ్లీ సినిమాలు చూస్తామా? అభిమాన హీరో సినిమాకు కాగితాలు ఎగరవేస్తామా? ఈలలు, గోలలతో మునుపటిలా ఎంజాయ్ చేస్తామా? అన్న ఆందోళన అభిమానుల్లో ఉండేది. ఇన్నాళ్లు అన్నింటిని తెరిచిన కేంద్రం సమూహంగా కూర్చునే థియేటర్ల విషయంలో మాత్రం ఇంకా కండీషన్లు పెట్టింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో సినీ పరిశ్రమకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనాతో మూతపడ్డ సినిమా ఇండస్ట్రీకి కేంద్రం గొప్ప శుభవార్త చెప్పింది. మూతపడ్డ సినిమా థియేటర్లు రేపటి నుంచి పూర్తిస్థాయి కెపాసిటీతో తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 10 నెలల తర్వాత సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో ఓపెన్ కానున్నాయి.

కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. దేశంలోని పలు ప్రాంతాల్లోని సినిమా హాళ్లు పూర్తిస్థాయి కెపాసిటీతో తిరిగి ప్రారంభించడానికి అనుమతులు లభించాయి.

గత నెల ఆన్ లాక్ 5లో భాగంగా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే సినిమాలు ప్రదర్శించాలని కేంద్రం షరతు విధించింది. సినిమా రిలీజ్ టైంలను మార్చింది.

అయితే తాజాగా మార్గదర్శకాల ప్రకారం థియేటర్లు వందశాతం ప్రేక్షకుల కెపాసిటీతో నడుపుకునేందుకు అనుమతి లభించింది. అయితే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.

నిబంధనల ప్రకారం ప్రేక్షకులు, సిబ్బంది మాస్కులు ధరించడం.. సామాజిక దూరం పాటించడం.. థర్మల్ స్క్రీనింగ్ పాటించేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రేక్షకుల నుంచి ఫోన్ నంబర్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.