నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నా లోపాయకారి ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అరెస్టు వ్యవహారం నడిచిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వైసీపీ నేతలు మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా చెబుతున్నారు. ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రఘురామ కృష్ణం రాజు కేసులో తమ ప్రమేయం ఏదీ లేదని పదే పదే చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.సీఐడీ సుమోటాగా..
రఘురామ కృష్ణంరాజు కేసులో సీఐడీ సుమోటాగా స్వీకరించిందచి సజ్జల స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అస్తిర పరచేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ ఆ కుట్రలేంటో తెలియజెప్పలేకపోయారు. రఘురామ కృష్ణం రాజు విషయంలో స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడంపై సజ్జల స్పందించారు. స్పీకర్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదో తెలియదన్నారు.
అన్ని సజ్జల పర్యవేక్షణలోనే..
ఏపీలో జరిగే పరిణామాలన్నింటిలో సజ్జల ప్రమేయం ఉందని తెలుస్తోంది. రఘురామ అరెస్టు వ్యవహారంలో సైతం మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగిందని భావిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సజ్జల ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని చెబుతున్నారు. కానీ ఎలా చేస్తున్నారో చెప్పడం లేదు. దీంతో సజ్జల వ్యవహార శైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నేతలే అన్ని పరిణామాలకు మూల కారణమని చెప్పకనే చెబుతున్నారు
పరిస్థితి ఎటు వెళ్తుందో?
ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. రఘురామ వ్యవహారంలో సుప్రీంకోర్టు సైతం కలుగజేసుకునే వరకు కూడా వెళ్లడంతో ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. తాజా పరిస్థితులపై ఎవరి అంచనాల్లో వారు ఉండిపోయారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. రోజులు మారే కొద్ది కేసు పలు మలుపులు తిరుగుతూ అందరినీ ఆశ్చర్యంలో ఉంచుతోంది.