https://oktelugu.com/

Pawan Kalyan Chiranjeevi: చిరంజీవినే సీఎం.. పవన్ ఒప్పుకుంటారా? బీజేపీ స్కెచ్ ఏంటి?

Pawan Kalyan Chiranjeevi: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తమ పట్టు సాధించాలని.. బలమైన నేతలను ఏరికోరి మరీ వారికి అధికారం అప్పగిస్తుంటుంది. యూపీలో యోగి, అస్సాంలో బిశ్వ శర్మ సహా ఎంతో మంది నాయకత్వ పటిమ గల నేతలకు అధికారం అప్పగించేసి ప్రజలకు మెరుగైన పాలన అందించేసి గెలిచేలా చేస్తుంది. తెలంగాణలోనూ చాలా మంది బీజేపీ నేతలను అధ్యక్షులుగా చేసినా బీజేపీ ఆశించిన ప్రయోజనం దక్కించుకోలేకపోయింది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2022 / 07:51 PM IST
    Follow us on

    Pawan Kalyan Chiranjeevi: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో తమ పట్టు సాధించాలని.. బలమైన నేతలను ఏరికోరి మరీ వారికి అధికారం అప్పగిస్తుంటుంది. యూపీలో యోగి, అస్సాంలో బిశ్వ శర్మ సహా ఎంతో మంది నాయకత్వ పటిమ గల నేతలకు అధికారం అప్పగించేసి ప్రజలకు మెరుగైన పాలన అందించేసి గెలిచేలా చేస్తుంది.

    తెలంగాణలోనూ చాలా మంది బీజేపీ నేతలను అధ్యక్షులుగా చేసినా బీజేపీ ఆశించిన ప్రయోజనం దక్కించుకోలేకపోయింది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక బీజేపీకి దూకుడు వచ్చింది. అధికారం దిశగా సాగుతోంది. సరైన నాయకులను ఎంపిక చేసుకోవడంలో బీజేపీ ఆది నుంచి సక్సెస్ అవుతోంది. మోడీ నుంచి మొదలుపెడితే ప్రాంతీయ పార్టీల నేతల వరకూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెరుగైన మెరికలనే ఏరుకుటుంది.

    ఇప్పుడు ఏపీలోనూ ఆ దిశగా బలమైన నేత కోసం బీజేపీ అన్వేషిస్తోందని సమాచారం. ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీ చూపు పడిందని సమాచారం. ఎందుకంటే ఊరికే పిలవరు మహానుభావులు అన్నట్టు రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయిన చిరంజీవిని మోడీ సభకు పిలవడంతోనే అందరిలోనూ అనుమానాలు వచ్చిపడ్డాయి. ఓవైపు ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రధాని వస్తున్నా ఆయనను పిలవడానికి బీజేపీకి ధైర్యం రాలేదు. కనీసం భాగస్వామి పక్ష నేతగానైనా ఆహ్వానించలేదు. దీనికి అసలు కారణాలేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

    కేంద్రంలో వైసీపీ సాయం తీసుకున్న బీజేపీకి రాష్ట్రంలో పవన్ కల్యాణ్ తీరు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగానే పవన్ రాజకీయం చేస్తున్నారు. జగన్ ను ఓడించడానికి.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి అవసరమైతే టీడీపీతోనూ కలిసి పోటీచేయడానికి సంకేతాలు పంపారు.ఇదే బీజేపీకి మింగుడుపడలేదు. బీజేపీని ఓడించడానికి గత ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కని గడపలేదు.. తొక్కని పార్టీ లేదు. అందుకే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడాన్ని బీజేపీ పెద్దలు సహించలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఫక్తు జగన్ పైనే విరుచుకుపడుతూ చంద్రబాబును పల్లెత్తు మాట అనని పవన్ కళ్యాణ్ తీరు నచ్చకనే ఆయనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించలేదని.. ఇటీవల నడ్డా.. నేడు మోడీ టూర్లకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

    ఇక ఇప్పటంలో బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే ఏపీలో పర్యటనలకు వెళతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు బీజేపీతో సంబంధం లేకుండానే దసరా నుంచి నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఏకంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇదే ఊపులో జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా లేదా కలిసి వచ్చే పార్టీలతో ఎలాగైనా సరే జగన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. కానీ మోడీ మాత్రం ఈరోజు అల్లూరి జయంతిలో జగన్ ను పక్కనపెట్టుకొని మరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    ఈ నేపథ్యంలోనే బీజేపీ రూటు మార్చినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటనకు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకుండా ఆయన అన్నయ్య చిరంజీవిని పిలవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సెట్ కావడం లేదని.. అందుకే చిరంజీవిని బీజేపీ తరుఫున తెరపైకి తీసుకొస్తున్నట్టు సమాచారం. కానీ రాజకీయాల్లో రిటైర్ అయిపోయిన చిరంజీవి మళ్లీ వచ్చే సూచనలు లేవు. అందునా తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థానంలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ తరుపున నిలబడే అవకాశాలు మచ్చుకైనా లేవు. కానీ ఆశ చావని బీజేపీ ఏపీ పగ్గాలు అప్పగించి సీఎం క్యాండిడేట్ గా చిరు ను ప్రొజెక్ట్ చేయాలని ఆలోచిస్తోందట.. అందుకే అంతటి ప్రాధాన్యం చిరుకు దక్కిందని అంటున్నారు. ఎలాగూ చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరి జోడి అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటే బీజేపీకి ఉపశమనం. అందుకే చిరు మెల్లిగా ముగ్గులోకి దించాలిన బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    బీజేపీ పాలిటిక్స్ కు చిరంజీవి చిక్కే అవకాశాలు మాత్రం లేవంటున్నారు. చిరంజీవిని సీఎం క్యాండిడేట్ గా తెరపైకి తెస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒప్పుకుంటారని మద్దతు ఇస్తారని బీజేపీ భావిస్తోంది.కానీ తమ్ముడు పవన్ ను పక్కనపెట్టి తను సీట్లో కూర్చోవాలని చిరంజీవి ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ల బంధం అత్యంత ధృడమైనది. మరి ఈ పవర్ పాలిటిక్స్ లో చిరంజీవిని దించాలన్న బీజేపీ ప్రయత్నాలు నెరవేరుతాయా? లేవా? అన్నది వేచిచూడాలి.