Chinajiyar KCR: ‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణ గూరూజీ-భక్తుడి మధ్య చిచ్చుపెట్టింది. చినజీయర్ స్వామి, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య దూరాన్ని పెంచింది. తెలంగాణలో ప్రతిష్టించిన ఈ విగ్రహం, ఆలయాన్ని జాతీయస్థాయికి ఇనుడించేలా చేయడంలో కేసీఆర్ సహకారం మరువలేనిది. ఎందుకంటే ఆ దేవాలయం కట్టింది హైదరాబాద్ శివారులోనే.. అక్కడి రోడ్లు, మౌళిక వసతులు కల్పించింది కేసీఆర్ సర్కార్ నే.. అయితే మొత్తం క్రెడిట్ మాత్రం మోడీ సర్కార్ కే వెళ్లింది. అదే కేసీఆర్ లో కోపానికి కారణమైందని.. ఆయనతో చినజీయర్ కు చెడిందని వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ‘యాదాద్రి’ ఆలయ నిర్మాణ బాధ్యతలను ‘చినజీయర్’ స్వామి చేతుల్లో పెట్టాడట కేసీఆర్. ఆయన సూచనల ప్రకారమే కోట్లు ఖర్చు పెట్టి ఆలయాన్ని తీర్చిదిద్దాడు. ఇక హైదరాబాద్ శివారులోని మారుమూలన ఉన్న ‘సమతామూర్తి’ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు.కేసీఆర్ మద్దతు, లేకుంటే ఆ రోడ్లు, ఆ గ్రామానికి, అక్కడి ప్రాంతానికి అంతటి దశ వచ్చేది కాదు.
Also Read: వైఎస్ వివేకా హత్య: టీడీపీలో చేరేందుకు ఆయన కూతురు రెడీ అయ్యిందా?
ఇంత చేస్తే దాన్ని మోడీతో ఆవిష్కరింపచేశాడు చిన్నజీయర్ స్వామి. మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను రంగంలోకి దించాడు. సరే పోనీలే అనుకుంటే అసలు మోడీ ఆవిష్కరించిన శిలా ఫలకంలో లోకల్ సీఎం కేసీఆర్ పేరు లేకపోవడమే ఇప్పుడు ఆయనలో కోపం నాశాలానికి ఎక్కడానికి కారణమట.. మొత్తం తాను చేస్తే బీజేపీ, మోడీ క్రిడెట్ తీసుకుపోయిందని.. సమతామూర్తి ఖ్యాతి తనకు రాలేదని.. ఇదంతా చిన్నజీయర్ స్వామి చేశాడని కేసీఆర్ రగిలిపోతున్నట్టు మీడియాలో, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అది నిజమో కాదో తెలియదు కానీ ఈ గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.
Also Read: నేడు జగ్గారెడ్డి రాజీనామా? కాంగ్రెస్ కు షాక్?
ఈ వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చినజీయర్ కు కేసీఆర్ కు మధ్య విభేదాలు తలెత్తాయని జోరుగా ప్రచారం సాగింది. ఈ వివాదంపై తాజాగా చినజీయర్ స్వామి స్పందించారు. తనకు కేసీఆర్ తో ఎలాంటి విభేదాలు లేవని.. ఉత్సవాలకు కేసీఆర్ పూర్తిగా సహకరించారని తెలిపారు.ఇక్కడికి వచ్చిన మొదటి వాలంటీర్ కేసీఆర్ యేనని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
Also Read: టిక్ టాక్ స్టార్ దుర్గారావు నెల సంపాదన ఎంతో తెలుసా?
ఉత్సవాలకు కేసీఆర్ రాకపోవడానికి ఆరోగ్యం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల దృష్ట్యా ఆయన రాలేకపోయి ఉంటారని.. సీఎం కేసీఆర్ ను కూడా కల్యాణానికి ఆహ్వానిస్తామన్నాని తెలిపారు. ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలతో తమకు భేదాలు లేవని చినజీయర్ స్వామి తెలిపారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయాల్లోనే ఉంటాయి. భగవంతుడి వద్ద కాదు.. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోట ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదని చినజీయర్ స్వామి తెలిపారు. దీన్ని బట్టి కేసీఆర్ కు బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని పరోక్షంగానే చినజీయర్ స్పష్టం చేశాడా? విభేదాలు నిజమేనా?అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.