https://oktelugu.com/

China- India: భారత్ చుట్టు ఉచ్చు బిగిస్తున్న చైనా.. పాక్, అప్ఘన్ లో తిష్ట

China- India: చైనా దురాగాతాలు అంతులేకుండా పోతున్నాయి. ఇప్పటికే శ్రీలంక ను వాడుకుంటున్న చైనా పాక్, అఫ్ఠనిస్తాన్ లను కూడా తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. యువాన్ వాంగ్ నిఘా నౌకను శ్రీలంక తీరానికి చేర్చి భారత్ కు భయం కలిగిస్తోంది. ఇక పాక్, అప్ఘన్ లను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా సరైన రీతిలో స్పందిస్తోంది. చైనా దురాగాతాలను గమనిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో అల్లర్లు చెలరేగేందుకు డ్రాగన్ చేస్తున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 17, 2022 / 06:31 PM IST
    Follow us on

    China- India: చైనా దురాగాతాలు అంతులేకుండా పోతున్నాయి. ఇప్పటికే శ్రీలంక ను వాడుకుంటున్న చైనా పాక్, అఫ్ఠనిస్తాన్ లను కూడా తన దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. యువాన్ వాంగ్ నిఘా నౌకను శ్రీలంక తీరానికి చేర్చి భారత్ కు భయం కలిగిస్తోంది. ఇక పాక్, అప్ఘన్ లను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూడా సరైన రీతిలో స్పందిస్తోంది. చైనా దురాగాతాలను గమనిస్తోంది. అంతర్జాతీయ సమాజంలో అల్లర్లు చెలరేగేందుకు డ్రాగన్ చేస్తున్న దుశ్చర్యలను అమెరికా కూడా నిశితంగా పరిశీలిస్తోంది.

    China- India

    పాకిస్తాన్ లోని సీపెక్ కారిడార్ ను తమకు అప్పగించాలని చైనా పాక్ పై ఒత్తిడి చేస్తోంది. తమ సైనికులను రంగంలోకి దింపాలని డ్రాగన్ కుట్రలు చేస్తోంది. పాక్, అఫ్గన్ లలో మిలిటరీ పోస్టులు ఏర్పాటు చేసేందుకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తోంది. దీంతో డ్రాగన్ కుట్రలను అన్ని దేశాలు కూడా గమనిస్తున్నాయి. ఈ మేరకు చైనా రాయబారి పాక్ ప్రధాని, విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో చైనా కుట్రలకు చెక్ పెట్టేందుకు ఇండియా కూడా తగు రీతిలో ప్రయత్నాలు చేస్తోంది.

    Also Read: KCR Politics: బీజేపీని విలన్ ను చేసేలా కేసీఆర్ సెంటిమెంట్ పాలిటిక్స్

    పాక్ లోని గ్వదార్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వాడుకోవాలని చూస్తోంది. తమ మిలిటరీ సిబ్బంది, విమానాలు తిరిగేందుకు అనుకూలంగా చేసుకుంటోంది. ఇప్పటికే అక్కడ కంచె నిర్మించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాలను తమ గుప్పిట్లోకి తీసుకుని వాటి ద్వారా తన కుట్రలు అమలు చేయాలని చూస్తోంది. దీంతో చైనా యుద్ధ సన్నాహాల్లో ఉందనే అనుమానం భారత్ కు కలుగుతోంది. చైనా బీఆర్ఐ ప్రాజెక్టును అఫ్గనిస్తాన్ మీదుగా మధ్య ఆసియాలోకి విస్తరించాలని కలలు కంటోంది.

    China- India

    డ్రాగన్ తీరుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చైనా యుద్ధానికి కాలు దువ్వితే సరైన గుణపాఠం చెప్పాలని ఇండియా కూడా చూస్తోంది. పేద దేశాలను తమకు అనుకూలంగా చేసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించి భారత్ ను భయపెట్టాలని చూస్తే దానికి దీటైన సమాధానం మనం కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిసినా చైనా ఎందుకు కుట్రలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని తొడగొట్టి సవాలు చేసే సత్తా మన దేశానికి ఉందన్న విషయం తెలిసినా డ్రాగన్ ఎందుకు కుట్రలు చేస్తోందో తెలియడం లేదు.

    Also Read:NTR Arogya Ratham: చంద్రబాబుకు బామ్మర్ది బాలయ్య హ్యాండ్ ఇస్తాడా ఏంటి? ఎన్టీఆర్ పేరుతో ముందుకు

    Tags