China- Abdul Raoof: ప్రపంచంలో మిగతా దేశాల వైఖరి ఎలా ఉన్నా.. చైనా మాత్రం తన సొంత ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే సరిహద్దు దేశాలను కబళించేందుకు కూడా వెనకాడదు. టిబెట్, తైవాన్, శ్రీలంక, అక్సాయ్ చిన్.. ఇలా వివాదాస్పదమైన ప్రతి ప్రాంతంలోనూ చైనా వేలు పెట్టింది. ఫలితంగానే అక్కడి భూములు, విలువైన వనరులు చైనా స్వాధీనమయ్యాయి. అమెరికాను పక్కకు తోసి అగ్రరాజ్యంగా అవతరించాలని, ప్రపంచం మొత్తాన్ని శాసించాలని చైనాకు కుయుక్తులు అన్నీ ఇన్ని కావు. బహుశా తన కపట పన్నాగాలకు నిదర్శనంగానే తనకు మరో పేరుగా డ్రాగన్ ను ఎంచుకున్నది కావచ్చు. జీవశాస్త్ర పరిభాషలో కూడా డ్రాగన్ అనేది ఒక పరాన్న జీవి. ఇతర కీటకాలను చంపి తింటే కానీ అది బతకలేదు. చైనా కూడా అంతే.
అబ్దుల్ రవూఫ్ కు అండగా
తన అవసరాల ఆధారంగానే ఇతర దేశాలను చైనా వాడుకుంటుంది. ప్రస్తుతం భారత్ కు పాకిస్తాన్ శత్రువు కాబట్టి.. భారత్ ను కూడా చైనా శత్రువుగా భావిస్తున్నది. కాబట్టి.. శత్రువుకు శత్రువు తన మిత్రువు అనే సామెత మాదిరి పాకిస్తాన్ కు చైనా దగ్గర అయింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు అనేక విధాలుగా ఆర్థికంగా అండదండలు అందించింది. భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీగా రోడ్లు, ప్రాజెక్టులు, వంతెనలు నిర్మిస్తోంది. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మొత్తం తన చెప్పు చేతుల్లోకి తీసుకునేలా డ్రాగన్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇటీవల తైవాన్ లో అమెరికా చట్టసభల ప్రతినిధి పర్యటించారు. దీనిపై భారత్ తటస్థ వైఖరి అవలంబించింది. దీనిని మనసులో పెట్టుకొని జై షే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రహుఫ్ ను నిషేధిత జాబితాలో పెట్టాలన్న అమెరికా, భారత్ ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. ఇదే సమయంలో తూర్పు లడక్ ప్రాంతంలోని భారత బలగాలను రెచ్చగొట్టేందుకు చైనా యుద్ధ విమానాలను దింపింది.
Also Read: Rakesh Jhunjhunwala Passes Away: ఇండియన్ వారెన్ బఫెట్ ఇకలేరు
భారత్- చైనా సైనిక చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పటికీ డ్రాగన్ దానిని అంగీకరించలేదు. పైగా వాస్తవాధీన రేఖ సమీపంలో సైనిక, వాయుసేన కార్యకలాపాల నివేదికపై భారత దేశంలోని చైనా రాయబారి సన్ వీడాంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.” భారత్ చైనా మధ్య సంతకం చేసిన ఒప్పందాల ప్రకారం సరిహద్దులో అన్ని కార్యకలాపాలను మేము నిర్వహిస్తాం. ప్రస్తుతం ఏ ఉద్యమం గురించి నా వద్ద నిర్దిష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం ఈ విదేశాల సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగానే ఉందని” పేర్కొనడం గమనార్హం. అయితే దీనిపై అమెరికా భారత లేవనెత్తిన ప్రశ్నలకు భద్రతామండలిలో చైనా దాటవేత ధోరణి ప్రదర్శించింది.” రవూఫ్ పై నిషేధం విధించేందుకు అందిన దరఖాస్తును జాగ్రత్తగా అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలని ” ఆ దేశ ప్రతినిధి వెల్లడించడం గమనార్హం. అయితే రవూఫ్ పై నిషేధం విధించాలని భారత అమెరికా చేసిన ప్రతిపాదనకు భద్రతామండలిలోని 14 దేశాలు మద్దతు ఇవ్వడం ఇక్కడ గమనించదగ్గ విషయం.
చైనా ఎందుకు ఇలా చేస్తోంది
వాస్తవానికి భారతదేశమంటే చైనాకు మొదటి నుంచి అక్కసే. అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దుల్లో నిర్మాణాలు చేపట్టే దగ్గర నుంచి పాకిస్తాన్లో రోడ్లు నిర్మించేదాకా.. ఇలా ప్రతి విషయంలోనూ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి నుంచి అమెరికా దాకా అన్నిచోట్ల చివాట్లు ఎదురవుతున్నా డ్రాగన్ తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా చైనాకు సంబంధించిన పలు యాప్ లను ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య కూడా తగ్గించింది. ఇక ఆ దేశానికి సంబంధించిన మొబైల్ కంపెనీలు మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, దొడ్డిదారిన ఆదాయాన్ని తమ దేశానికి తరలించాయి. దీన్ని గుర్తించిన భారత ఆదాయ పన్ను శాఖ అధికారులు చైనా కంపెనీలకు భారీగా జరిమానాలను విధించారు. పైగా ఇటీవల పలు విషయాల్లో అమెరికాకు భారత్ మద్దతు ఇచ్చింది. వీటి అన్నింటిని మనసులో పెట్టుకున్న డ్రాగన్ భారత్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఒక ఉగ్రవాది విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలుస్తోంది. కానీ గతంలోనూ పాలు దేశాలు ఇలానే వ్యవహరించి తీవ్రంగా నష్టపోయాయి. రేపటి నాడు చైనా కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
Also Read: Jr NTR In Oscar Race: ఆర్ఆర్ఆర్ దెబ్బకు.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అందులో ఏం విశేషం ఏంటంటే?