ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే చైనా సంతాన సూత్రానికి చెక్ పెట్టింది. దీంతో జనాభా తగ్గిపోయే ప్రమాదముందని గ్రహించిన డ్రాగన్ ఇకపై ముగ్గురు పిల్లలను కనవచ్చని అనుమతులు ఇచ్చింది. దీంతో జనాభా పెంచుకోవాలని భావిస్తోంది. కమ్యూనిస్టు ప్రభుత్వం అమలు చేసిన కుటుంబ నియంత్రణ విధానంతో సంతాన వృద్ధి దెబ్బతింది. దీంతో దిద్దుబాట చర్యలకు ఉపక్రమించింది.
ఒక్కరి కన్నాఎక్కువ మందిని కనే కుటుంబాలు జరిమానా చెల్లించేవారు.2012 నాటికి జరిమానాల వల్ల చైనా ప్రభుత్వానికి రూ.31,400 కోట్ల డాలర్లు సమకూరాయి. 2010 నాటికి చైనా జనాభాలో ప్రతి 118 మంది పురుషులకు కేవలం 100 మంది స్ర్తీలు ఉన్నారని తేలింది. నేడు చైనాలో స్ర్తీలకన్నా పురుషుల సంఖ్య 3.3 కోట్లు ఎక్కువ లింగ నిష్పత్తిలో ఈ వైపరీత్యం వధువుల కొరత సృష్టించింది.
గ్రామాల్లోని పేద చైనీయులక వధువు దొరకని స్థితి నెలకొంది. ఆడపిల్లల కొరత కన్యాశుల్క విజృంభనకు కారణమైంది. ఒకప్పుడు 11 వేల యువాన్లు ఉన్న కన్యాశుల్కం నేడు 10 లక్షల యువాన్లకు చేరింది. చైనాలో గ్రామీణుల సగటు వార్షికాదాయం 15,000 యువాన్లు మాత్రమే. దీంతో వారు పెళ్లి చేసుకోవడానికి అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
చైనాలో పనిచేసే వయసులోని వారి కన్నా 60 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఫలితంగా 2011లో 93.5 కోట్లుగా ఉన్న చైనా శ్రామిక జనాభా 2020 కల్లా89.4 కోట్లకు తగ్గిపోయింది. 2010లో చైనా జనాభాలో పనిచేసే వారు70.1 శాతంగా ఉండగా 2050 కల్లా అది 50 శాతానికి తగ్గిపోనున్నది. ఇది ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే పరిణామమే. దీంతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏక సంతాన విధానానికి స్వస్తి పలకనుంది.