Chenab Bridge in Kashmir : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే ఈ వంతెన గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఈ వంతెన ఎందుకు నిర్మించారు? అంత వ్యయంతో నిర్మించాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఈ వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read : మేఘాలపై తేలియాడుతున్న ‘చినాబ్’ రైల్వే బ్రిడ్జి.. వైరల్ ఫొటోలు
చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరుపొందింది. జమ్ము కాశ్మీర్లోని కౌరి – బక్కల్ ప్రాంతాల మధ్య దీనిని నిర్మించారు. ఆర్చి రూపంలో ఈ వంతెనను తీర్చిదిద్దారు. కట్ ధా ప్రాంతం నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం సాగించే వందే భారత్ రైలు కు పచ్చా జెండా ఊపి నరేంద్ర మోడీ ఈ వంతెనను ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ వంతెన నిర్మాణం శతాబ్దం కాలంనాటి కల.. శివాలిక్, పిర్ పంజల్ పర్వత శ్రేణులను ఈ రైలు మార్గం కలుపుతుంది. ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ వంతెన నిర్మించడానికి పూనుకున్నారు. ఇంజనీర్లతో సర్వే కూడా నిర్వహించారు. అది కార్యరూపం దాల్చలేదు. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఈ లోయలో ఉన్న నది నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో అత్యంత ఆధునికమైన సాంకేతికతను ఉపయోగించారు. భూకంపాలు చోటు చేసుకున్నా.. వరదల వంటివి సంభవించినా.. చెక్కుచెదరకుండా ఈ వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జిని ప్రారంభించిన తర్వాత జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు వెళ్లే దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జి మీదుగా వందే భారత్ రైలు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఈ వంతెన దాదాపు 120 సంవత్సరాల పాటు సేవలు అందిస్తుందని.. ఈ వంతెన పై రైలు గరిష్ట వేగం 100 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చని అధికారులు చెబుతున్నారు.
1.31 కిలోమీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించారు. దీనికోసం దాదాపు 1486 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన నిర్మాణం కోసం 28 వేల టన్నుల ఉక్కు వినియోగించారు. ఆరు లక్షల బోల్టులు, 17 స్పాన్స్ ఉపయోగించారు. ఈ వంతెన నిర్మాణానికి 93 డెక్ సెగ్మెంట్స్ ఉపయోగించారు. ఇందులో ఒక్కో దాని బరువు 85 టన్నులు. ఈ వంతెన ఆర్క్ పొడవు 480 మీటర్లు. ఆర్చ్ స్పాన్ పొడవు 467 మీటర్లు. ఈ బ్రిడ్జి -20 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. 266 కిలోమీటర్ల వేగంతో గంటకు గాలులు వీచినప్పటికీ దీనికి ఏమీ కాదు.వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న 2002 సంవత్సరంలో ఈవంతెనకు రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తి కావడానికి దాదాపు 23 సంవత్సరాలు పట్టింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లాకు ఈ రైల్వే బ్రిడ్జిని అనుసంధానం చేశారు. తద్వారా జమ్మూ కాశ్మీర్ మొత్తం భారత రైల్వే తో కనెక్ట్ అవుతుంది.
Chenab Bridge India’s Sky Highway!
Behold the Chenab Bridge — the world’s highest railway bridge.
359m above the river, Taller than the Eiffel Tower, Crane tower is larger than Qutub Minar.
Part of the Udhampur-Srinagar-Baramulla rail link — connecting Katra to Banihal,… pic.twitter.com/ziJ0VzFBdN
— MyGovIndia (@mygovindia) June 4, 2025