Chandrababu strategy : తెలంగాణలో ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక చంద్రబాబుకు ఓ రూటు చూపించినట్లయ్యింది. ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న టార్చన్ ను తట్టుకోలేకపోతున్న బాబు ఇక నుంచి ఆ.. రకమైన అస్త్రంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు తాను అనుకున్నది జరిగితే ఎన్నికల్లో గెలవడం ఖాయం అని తన సన్నిహితులతో జరిగిన సమావేశంలో వ్యాఖ్యలు చేశాడట. ఏన్నో ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి ఆ.. విషయంలో తీవ్రంగా భయపడ్డారు. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, ఇక మనకు దారి దొరికిందని సీనియర్ నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం సీనియర్ నాయకుల్లో కాస్త ఉత్సాహాన్ని నింపిందని అంటున్నారు.
అసెంబ్లీలో ఇటీవల జరిగిన వ్యవహారంపై చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన తరువాత సీనియర్ నాయకులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు బాబు భరోసా ఇచ్చారట. ఇన్నాళ్లు తాము వైసీపీ ప్రభుత్వానికి తీవ్రంగా భయపడేవారు. ఎందుకంటే జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఈ సమయంలో తాము ఏం చెప్పినా ప్రజలు వినే పోజిషన్లో లేదు. అందువల్ల వైసీపీ చేపడుతున్న సంక్షేమ పథకాల కంటే తాము మంచి పథకాలు చెబుతామని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీకి ఎన్నికలు ఏవైనా పరాభావమే ఎదురవుతోంది.
తెలంగాణలో ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించారు. ఇక్కడి పరిస్థితి ముందే గ్రహించి గులాబీ నేత కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. కుటంబానికి రూ.10 లక్షలతో వ్యాపారాన్ని పెట్టించారు. ఈ ఫలాలు కొందరికి దక్కాయి కూడా.అంతేకాకుండా ఇతర సంక్షేమ పథకాలను ఇబ్బడిముబ్బడిగా కేవలం హుజూరాబాద్ నియోజకవర్గానికే కేటాయించారు. మొత్తంగా రూ.200 కోట్లకు పైగానే ఇక్కడ నిధులు మళ్లించినట్లు సమాచారం. అయినా నియోజకవర్గ ప్రజలు అధికార పక్షానికి కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి ఓటు వేశారు.
Also Read: బాబూ… ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పు… నేషనల్ వైడ్ ఇదే హాట్ టాపిక్
ఈ పరిస్థితిని గమనించిన బాబు ఇక్కడ కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏపీ ప్రజలు వైసీపీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకే ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని తప్పులను ఎన్ని చూపినా ప్రజలు పట్టించుకోలేదు. అయితే ఆ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా..? లేదా వాటిలో అవినీతి జరుగుతుందా..? అనే కోణంలో వాటిపై ప్రచారం చేయనున్నారట. హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి కొంతమందికి నిధుల ద్వారా ఆయా వ్యాపారాలను పెట్టించింది. మిగతా వారి అకౌంట్లలో డబ్బులు పడినా వారు నేరుగా తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. అదే విషయాన్ని బీజేపీ అస్త్రంగా చేసుకొని ప్రచారం చేసింది. ఫలితంగా ప్రజలు కూడా అదే ఆలోచించి టీఆర్ఎస్ ను ఓడించారు. ఏపీలోనూ సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా వాటి అమలులో లోపాలున్నాయని ఎత్తిచూపేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఇటీవల వరద బాధితులను పరామర్శించేందుకు బాబు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తన హయాంలో ‘తిత్లీ’, ‘హుద్ హుద్’ తుఫాన్ల సందర్భంగా 16 నుంచి 17 మంది చనిపోయారన్నారు. అయితే ఇప్పుడు జరిగిన వరదల్లో 34 మంది మరణించినట్లు ప్రభుత్వమే చెబుతోంది. ఇక అనధికారికంగా ఎంతో మంది తెలియదు. దీంతో ప్రాణ నష్టాన్ని అరికట్టడంలో జగన్ విఫలమయ్యారని అన్నారు. దీంతో బాబు జగన్ పై నేరుగా రాజకీయ విమర్శలు కాకుండా.. తాను చేస్తున్న పనులను, వాటిలోని లోపాలను ఎత్తిచూపితే ప్రజలను తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారట.
Also Read: వరద ముంపుపై ప్రభుత్వానికి పట్టింపు లేదా? చంద్రబాబు కీలక వ్యాఖ్యలు