https://oktelugu.com/

చివరకు చంద్రబాబు ఇలా చేస్తున్నాడా !

తిరుపతి ఉప ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగూ అక్కడ గెలుపు కష్టసాధ్యమని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు.. కనీసం వైసీపీ మెజారీటీని తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి.. వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ కన్నా తగ్గించాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బుది కూడా ప్రధాన పాత్ర కానుంది. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టనుంది. దీంతో చంద్రబాబు సైతం నిధుల […]

Written By: , Updated On : April 6, 2021 / 11:44 AM IST
Follow us on

Chandrababu
తిరుపతి ఉప ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగూ అక్కడ గెలుపు కష్టసాధ్యమని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు.. కనీసం వైసీపీ మెజారీటీని తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి.. వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ కన్నా తగ్గించాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బుది కూడా ప్రధాన పాత్ర కానుంది. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టనుంది. దీంతో చంద్రబాబు సైతం నిధుల సమీకరణ బాధ్యతను వారిద్దరికి అప్పగించినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నిధుల కొరత లేదు.కేంద్ర పార్టీ వద్ద దండిగా నిధులు ఉన్నాయి. అయితే ఓటమి పాలయ్యే ఉప ఎన్నికకోసం ఖర్చు చేయడానికి చంద్రబాబు నాయుడు ఇష్టపడడం లేదు. అందుకే తిరుపతి ఉప ఎన్నికకు నిధులు సమీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధానంగా ఈ బాధ్యతలను నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ కు అప్పగించినట్లు తెలిసింది.

పనబాక లక్ష్మీని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించినప్పుడే ఎన్నికల ఖర్చు తాను భరించలేనని చెప్పారు. ఎన్నికల్లో నిధులన్నీ పార్టీ చూసుకుంటుందంటేనే తాను బరిలో నిలుస్తానని, గత ఎన్నికల్లో తాను ఖర్చు చేశానని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆమె చెప్పారు. అయితే ఎన్నికల ఖర్చు మొత్తం పార్టీయే పెట్టుకుంటుందని నాడు చంద్రబాబు నాయుడు ఆమెకు భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు నిధులు ఏవీ విడుదల చేయకపోవడంతో.. పనబాక లక్ష్మీ ప్రచారం చేయలేదన్న గుసగుసలు వినవస్తున్నాయి.

దీనికి సంబంధంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లో ఉన్న టీడీపీ సానుభూతి పరులు, పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి, రవిచంద్ర యాదవ్ లకు అప్పగించారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన నేతలకు తిరుపతి ఉప ఎన్నికల బాధ్యత అప్పగించడాన్ని చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి లాంటివారు గుస్సగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంమీద చంద్రబాబు నాయుడు తిరుపతి ఎన్నికల్లో టీడీపీకి ఆర్థిక కష్టాలు లేకుండానే సీనియర్ నేతలను రంగంలోకి దింపారు.