https://oktelugu.com/

Pawan Kalyan- Chandrababu Meets Modi: మోదీ, బాబు కలయిక.. : పవన్ అదే కోరుకున్నాడా..?

Pawan Kalyan- Chandrababu Meets Modi: ఏపీలో మరోసారి ఆసక్తి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. మొన్నటి వరకు జనసేన దూకుడు పెంచగా.. ఇప్పుడు టీడీపీ కూడా వ్యూహం మార్చి ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడారు. మొన్నటి వరకు మోదీ అంటే చిర్రుబుర్రులాడిన బాబు ఇప్పుడు ఆయనతో కలిసి కాసేపు ముచ్చటించడం చర్చనీయాంశంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2022 / 12:21 PM IST
    Follow us on

    Pawan Kalyan- Chandrababu Meets Modi: ఏపీలో మరోసారి ఆసక్తి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. మొన్నటి వరకు జనసేన దూకుడు పెంచగా.. ఇప్పుడు టీడీపీ కూడా వ్యూహం మార్చి ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి మాట్లాడారు. మొన్నటి వరకు మోదీ అంటే చిర్రుబుర్రులాడిన బాబు ఇప్పుడు ఆయనతో కలిసి కాసేపు ముచ్చటించడం చర్చనీయాంశంగా మారింది. జాతీయస్థాయిలో టీడీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే మోదీ, బాబు కలయికతో టీడీపీ శ్రేణులో ఫుల్ జోష్ లో ఉన్నారు. వీరితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హ్యాపీగా ఉన్నారట. ఎందుకంటే..?

    Pawan Kalyan, Chandrababu , Modi

    జనసేన అధినేత పవన్ కొన్ని నెలలుగా రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఒకరిగా ఉంటున్నారు. రోడ్ల సమస్యలతో పాటు రైతుల పక్షాల పోరాడుతున్న పవన్ రోజురోజుకు మద్దతు పెరుగుతూ ఉంది. అటు జనసేన కేడర్ కూడా గ్రామాల వారీగా పార్టీ కార్యక్రమాలను విస్తరించుకుంటూ పోతున్నారు. జనాల్లో జనసేన క్రేజ్ ను చూసి తెలుగుదేశం పార్టీ ముచ్చటపడింది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తమకు కూడా కలిసి వస్తుందని భావించింది. ఇద్దరి లక్ష్యం వైసీపీని గద్దెదించడమే కనుగక.. కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పొత్తులకై టీడీపీ నేత బాబు సై అన్నారు. కానీ పవన్ ఆ విషయాన్ని పెండింగులో ఉంచారు.

    Also Read: Chandrababu Meets Modi: మోదీని కలవడం వెనుక చంద్రబాబు అసలు వ్యూహం ఇదేనా..?

    ఇప్పటివరకు బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ టీడీపీతో అలయన్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల సమయానికి నిర్ణయం చెబుతామన్నారు. అయితే అటు బాబు కూడా రియాక్షన్ అవ్వలేదు. పవన్ వెంటబడడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కడితే మేలనుకున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న బాబుకు రాష్ట్రపతి ఎన్నికలు దారి చూపాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అడగకపోయినా టీడీపీ మద్దతు ప్రకటించింది. దీంతో కొన్ని కార్యక్రమాలకు ఏపీలోనీ వైసీపీతో పాటు టీడీపీ అధినేతన చంద్రబాబును కూడా బీజేపీ పిలుస్తోంది.

    Pawan Kalyan, Chandrababu, Modi

    ఏపీలోని నరసాపుంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు టీడీపీ అధినేత బాబును బీజేపీ ఆహ్వానించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా బాబును ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. అయితే తనకు బదులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడును పంపారు. ఇప్పుడు ‘అజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి కూడా బాబుకు ఆహ్వానం పంపారు. ఇన్నాళ్లు మోదీతో స్నేహం కోసం ఎదురుచూస్తున్న బాబుకు ఇదే సరైన సమయం అని ఆలోచించారు. ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రత్యేకంగా మోదీతో కాసేపు మాట్లాడారు. వీరు కలిసి మాట్లాడుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

    ఈ క్రమంలో వైసీపీకి షాక్ ఇచ్చినట్లయింది. ఒకవేళ్ల మోదీ, బాబు దోస్తీ కడితే వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ పవన్ మాత్రం ఇదే కోరుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ తనకు తానుగా టీడీపీతో మైత్రి కడితే కమలం నాయకులు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బాబు నేరుగా మోదీని కలవడంతో మొత్తంగా బీజేపీ, టీడీపీతో స్నేహం చేసే అవకాశం కలిగినట్లయింది. దీంతో బాబు మోదీని కలవడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపుతుండగా.. జనసేన అధినేత కూడా ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read:PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!

    Tags