Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: ఆప్త శత్రువులతోనే చంద్రబాబుకు నష్టం

Chandrababu: ఆప్త శత్రువులతోనే చంద్రబాబుకు నష్టం

Chandrababu: రాజ గురువు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 సాంబశివరావు పని గట్టుకొని చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. జగన్ కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. తెల్లారి లేచింది మొదలు జగన్ పై విషపు రాతలతో రెచ్చిపోతున్నారు. చివరకు దోమలు, విషవాయువులతో చంద్రబాబును జగన్ చంపించే ప్రయత్నం చేస్తున్నారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇవి నమ్మశక్యం కాని నిజాలు కావడంతో తేలిపోతున్నాయి. ఎల్లో మీడియా ఆత్రుతను ప్రజలు లైట్ తీసుకుంటున్నారు.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో ఈ సంక్షోభం నుంచి ఎలా అధిగమించాలన్న దానిపై ఆప్తమిత్రులు సలహాలు సూచనలు ఇవ్వడం లేదు. ఇంకా చంద్రబాబు గొప్పవాడని, లోకేష్ బాబు తెలివైనవాడని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులో చుక్కెదురైనా.. తనకు ఈ పరిస్థితి వస్తుందని చంద్రబాబుకు ముందే తెలుసు.. అందుకే చాలా తెలివిగా సెక్షన్ 17 ఏ తీసుకొచ్చారని ఎటువంటి నామోషీ లేకుండా చెప్పుకొస్తున్నారు. అదో పెద్ద ఘనతగా ప్రత్యేక కథనాలు ఉండి వార్చుతున్నారు. అయితే అంతిమంగా నష్టం జరుగుతోంది చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకే. అసలు జైలుకు వెళ్లకుండానే చంద్రబాబు ఇంటికి వచ్చేస్తారని ఎల్లో మీడియా డిబేట్ లలో చెప్పుకుంది. అయితే ఏకంగా చంద్రబాబు కు రిమాండ్ కు తరలించడంతో వారు షాక్ గురయ్యారు. ఓ ఛానల్ ప్రజెంటేటర్ అయితే ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్ డే అని ప్రకటించారు. తొలుత కుంభకోణమే జరగలేదు అన్నారు. తరువాత మడత పేచి వేశారు. అది అసలు కుంభకోణమేనా? అన్న కొత్త రాగం అందుకున్నారు.

చంద్రబాబు అరెస్టుతో నింగి, నేల స్తంభించి పోయాయని.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఇల్లు మీడియా గోష పెడుతోంది. ఎన్నో గుండెలు ఆగిపోతున్నాయని చెప్పుకొస్తుంది. రోజుకు ఐదారు మరణాలను చంద్రబాబు అరెస్ట్ ఖాతాలోకి వేస్తోంది. వివిధ కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక గుండెలు ఆగిపోయాయంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. నెలల తరబడి కోమాలో ఉన్న రోగులు చనిపోయినా చంద్రబాబు అరెస్టుతో మనస్థాపానికి గురయ్యే ప్రాణాలు వదిలినట్టు నిస్సిగ్గుగా చెప్పుకొస్తోంది. వృద్ధాప్యం, దీర్ఘకాలకు అనారోగ్య సమస్యలతో చనిపోయిన వారిని కూడా టిడిపి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, చంద్రబాబుపై సింపతి క్రియేట్ చేసేందుకు వాడుకోవడం, దానికి ఎల్లో మీడియా ఫోకస్ పెట్టడం నీచాతి నీచంగా మారింది.

చంద్రబాబు విషయం కాస్త పక్కన పెడితే.. ఏపీ సీఎం జగన్ మీద ఎల్లో మీడియా అక్క సుకు అంతే లేకుండా పోతుంది. ప్రభుత్వ అధినేతగా జగన్ పైన ప్రతిరోజు బురద చల్లేస్తున్నారు. చివరకు వ్యక్తిగత విషయాలను కూడా వదిలిపెట్టడం లేదు. లండన్ లో చదువుకుంటున్న కుమార్తెలను చూసేందుకు వెళ్లిన విడిచిపెట్టడం లేదు. ” చార్టెర్డ్ ఫ్లైట్ లో పేదల పక్షపాతి” అంటూ పతాక శీర్షికన కథనం వండి వార్చారు. ఈ కథనం చదివితే చాలు ఎల్లో మీడియా ఏ స్థాయికి దిగజారిపోతుందోఇట్టే తెలిసిపోతుంది. జగన్ వెళ్ళింది ప్రత్యేక విమానంలో. తన సొంత ఖర్చులతో వెళ్లారు. విదేశాలకు వెళ్తే ఎవరైనా విమానాల్లోనే వెళ్తారు. పోనీ చంద్రబాబు ఆ మధ్యన లండన్ వెళ్లారు. నడిచి వెళ్లారా? లేక కారులో వెళ్లిపోయారా? లేకుంటే షిప్ పైన వెళ్ళారా? కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ఎల్లో మీడియా చేసే ప్రచారం తెలుగుదేశం పార్టీకి మైనస్ గానే మారుతుంది.

ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి ముంచుతోంది ఎల్లో మీడియా. ఈ సంబంధంలేని జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు అరెస్ట్ వివాదంలో తెస్తారు. భారతీయ జనతా పార్టీ పై నిందలు వేస్తారు. ఎన్డీఏ కంటే ఇండియా కూటమే మేలని చెబుతారు. బిజెపి కాకుంటే వామపక్షాలు లైన్ లో ఉన్నాయని ప్రచారం చేస్తారు. అవసరముంటే పవన్ పతాక శీర్షికల్లో ప్రాధాన్యమిస్తారు. లేకుంటే పాతాళంలోకి తొక్కేస్తారు. అన్ని సవ్యంగా జరిగితే తమ ఘనత అని చెప్పుకొస్తారు. లేకుంటే చంద్రబాబు తమ మాట వినలేదని తేలిగ్గా పక్కకు తప్పుకుంటారు. వీకెండ్ కామెంట్స్ తో లేనిపోని వివాదాలు తెచ్చి పెడుతుంటారు. ఇలా ఎలా చూసుకున్నా ఎల్లో మీడియా తో తెలుగుదేశం పార్టీకి అంతులేని నష్టమే. అందుకే బాలకృష్ణ లాంటివారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను తూలనాడు తుంటారు. తెలుగుదేశం పార్టీ సీనియర్లు చాలామంది ఎల్లో మీడియాను వ్యతిరేకిస్తుంటారు. కానీ బాబు గారికి కోపం వస్తుందని మౌనం పాటిస్తుంటారు. అదే ఎల్లో మీడియాతో చంద్రబాబు ఈ స్థాయికి రాగలిగారు. ఇప్పుడు అదే ఎల్లో మీడియాను నమ్ముకుని పాతాళానికి దిగజారి పోయారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version