Chandrababu : ఇటీవల చంద్రబాబు ప్రసంగ శైలి మారుతోంది. సినిమా డైలాగులతో మాట్లాడుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎలక్షన్ సమీపిస్తుండడంతో విమర్శలకు పదును పెడుతున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
మొన్న ఆ మధ్యన రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ లో రజనీకాంత్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏపీలో బాగా పాపులర్ అయ్యాయి ” మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి”అని తమిళంలో చెప్పి.. చివర్లో తెలుగులో ‘అర్థమైందా రాజా’ అని ఎండింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ పాపులర్ అయింది. సందర్భానుసారం ఈ డైలాగును అందరూ వాడేస్తున్నారు. చివరికి తాజాగా చంద్రబాబు సైతం వాడేసారు.
కాకినాడలో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. టిడిపి జోనల్ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలను ఉద్దేశించి చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడారు. జగన్ పనితీరుపై విమర్శలు గుర్తించారు. ఆ సమయంలో కరెంటు కోతలు ప్రస్తావన వచ్చింది. ఈరోజు చెప్తున్నా.. కరెంటు కోతలు లేని చోటు లేదు.. కరెంటు బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు.. ఆ రెండు జరగని ఊరే లేదు.. అర్థమైందా సైకో జగన్ రెడ్డి.. అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్ తో ప్రాంగణం మార్మోగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ ని టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది.