Chandrababu Jail: అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రబాబు.. బెయిల్ పై నేడు కీలక నిర్ణయం

అనారోగ్య కారణాలతో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.

Written By: Dharma, Updated On : October 27, 2023 1:19 pm

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: చంద్రబాబు కేసుల్లో నేడు కీలకం. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు 50 రోజులు కావస్తోంది. కానీ ఇప్పటివరకు చంద్రబాబుకు ఊరట దక్కలేదు. చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇటువంటి తరుణంలో అనారోగ్య కారణాలు చూపుతూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. దీంతో సర్వ త్ర ఉత్కంఠ నెలకొంది.

అనారోగ్య కారణాలతో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే అక్కడ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ కూడా జరిగింది. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే జూన్ 21న ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలలో తనకు ఒక కంటికి సంబంధించి ఆపరేషన్ జరిగిందని.. మూడు నెలల్లోపు మరో కంటికి శాస్త్ర చికిత్స చేయాల్సి ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే ఆది నుంచి స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో చుక్కెదురైంది. పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అక్కడ కూడా సుదీర్ఘ వాదనలు సాగాయి. ప్రధానంగా సెక్షన్ 17 ఏ చుట్టూ వాదనలు జరిగాయి. కానీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 8న వెల్లడించనుంది. ఇదే సమయంలో ఫైబర్ కేసులో సైతం మధ్యంతర బెయిల్ పిటిషన్ పై నవంబర్ 9న విచారించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు ఈ కేసు విచారణ రానుంది. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి నివేదికలను ఆయన తరుపు న్యాయవాదులు చేశారు. దీంతో తప్పకుండా బెయిల్ లభిస్తుందని టిడిపి వర్గాలు ఆశతో ఉన్నాయి. మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.