విశాఖలో ఉద్రిక్త వాతావరణం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొనబోతున్నారు. చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విశాఖలో భారీ ర్యాలీ చేయాలనీ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విశాఖ ప్రజా చైతన్య యాత్ర కోసం పోలీసుల అనుమతి కోరగా అందుకు పోలీసులకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. […]

Written By: Neelambaram, Updated On : February 27, 2020 10:23 am
Follow us on

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో ఆయన పాల్గొనబోతున్నారు. చంద్రబాబు కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు. విశాఖలో భారీ ర్యాలీ చేయాలనీ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

విశాఖ ప్రజా చైతన్య యాత్ర కోసం పోలీసుల అనుమతి కోరగా అందుకు పోలీసులకు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. భారీ ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో, ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అధినాయకుడి భారీగా స్వాగతం పలుకుతామని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. దీంతో విశాఖలో ఏం జరగబోతుందో తెలియక ప్రజలు అమోమయంలో పడిపోయారు.

విశాఖ, విజయనగర ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ నుంచి చంద్రబాబు పెందుర్తి మండలం వెళ్లి అక్కడ భూసమీకరణ బాధితులతో మాట్లాడాల్సి ఉన్నది. అక్కడి నుంచి విజయనగరంలో జరిగే ప్రజాచైతన్య యాత్రలో పాల్గొంటారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా విశాఖ ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబుని అడ్డుకోవాలని చూస్తున్నారు. దింతో విశాఖలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.