TDP BJP Alliance: మోడీని టెంప్ట్ చేసే ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..? జనసేన పరిస్థితేంటి?

TDP BJP Alliance : ఏపీలో పొత్తుల ఎత్తులు నడుస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా గుర్తించడంతో బీజేపీ జాతీయ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఇదే అదునుగా ఇతర పార్టీలు పాచికలు విసురుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అధికారం కోసం ఏమైనా చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం దేశంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడని సమాచారం. మొన్న ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ప్రసంగం […]

Written By: NARESH, Updated On : June 8, 2022 1:12 pm
Follow us on

TDP BJP Alliance : ఏపీలో పొత్తుల ఎత్తులు నడుస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా గుర్తించడంతో బీజేపీ జాతీయ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఇదే అదునుగా ఇతర పార్టీలు పాచికలు విసురుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అధికారం కోసం ఏమైనా చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రస్తుతం దేశంలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నాడని సమాచారం. మొన్న ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ప్రసంగం మొత్తం వైసీపీని గద్దెదించి బీజేపీ అధికారంలోకి రావడంపైనే మాట్లాడారు. జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శించారు. అంతేకానీ.. ప్రతిపక్ష టీడీపీని అధినేత చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయలేదు. దీంతో చంద్రబాబుకు ఈ పరిణామం కలిసి వచ్చి బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చి తన బుట్టలో పడేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో వైసీపీని ఓడించేందుకు అందరినీ కలుపుకొని పోతానని ప్రకటించారు. ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి పొత్తు కోసం ఓపెన్ ఆఫర్ విసిరారు. ఇది రాజకీయ -మీడియా వర్గాల్లో భారీ ఊహాగానాలకు దారితీసింది. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను చాలా మంది టిడిపి నాయకులు తేలికగా తీసుకుంటున్నారు. కనీసం చంద్రబాబు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి పోటీ చేసే సీట్ల సంఖ్యలో భారీగా కోతపడి పార్టీలో వ్యతిరేక వస్తుందని జనసేన-బీజేపీతో పొత్తు విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని టీడీపీ నేతలు గమ్మున ఉంటున్నారని తెలుస్తోంది.

కూటమి భాగస్వామ్య పక్షానికి కొన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అయితే జనసేన అంత తక్కువ సీట్లు తీసుకునే అవకాశాలు లేవు. టీడీపీ ఒంటరిగా పోటీచేసినా పూర్తి మెజారిటీ మార్కుకు దగ్గరగా సీట్లు రావడం ఖాయమంటున్నారు. తక్కువ రావని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు అన్ని సీట్లు ఇచ్చి కోల్పోవడం ఇష్టం లేదన్నట్టుగా టీడీపీ ఆలోచిస్తోంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టడానికి టీడీపీ రాజీ పడడానికి సిద్ధంగా లేదు.

అందుకే చంద్రబాబు కూడా ఇప్పుడు జనసేనతో కంటే బీజేపీతో వెళితే బెటర్ అని ఆలోచిస్తున్నట్టు సమాచారం. జనసేనను సైడ్ చేసేసి బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. దీనికి బీజేపీ అంగీకరిస్తే కూటమిలో చేరేందుకు టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో బీజేపీ పెద్దగా శక్తి లేకపోయినా.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబుకు కేంద్రం నుంచి గట్టి మద్దతు లభిస్తుంది.

2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర నాయకత్వంపై.. ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తిరుగుబాటు చేయడం ద్వారా తాను పెద్ద తప్పు చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు గ్రహించారు. ఇదే క్రమంలో ఏపీలోనూ అధికారాన్ని బాబు కోల్పోయారు. ఒంటరిగా పోటీచేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌కు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సహాయపడ్డారు.. కాబట్టి బీజేపీ కోసం టీడీపీ కొన్ని మెట్లు దిగడానికి సిద్ధంగా ఉంది. కానీ జనసేన పార్టీ కోసం ఇలా తగ్గడానికి ఒఫ్పుకోవడం లేదు. పొత్తుకు సమ్మతిస్తే 25 లోక్‌సభ స్థానాలకు గాను 13 ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు ప్రాధాన్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడమే తప్ప కేంద్రంలో కాదు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో గెలవడమే బీజేపీ ఆసక్తి అని.. రాష్ట్రంలో కాదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆంధ్రా నుంచి బిజెపికి మరిన్ని ఎంపి స్థానాలను గెలుచుకోవడంలో చంద్రబాబు సహాయం చేయగలిగితే.. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడానికి బిజెపి సహాయపడుతుందని.. ఇది ఇద్దరికీ విన్ విన్ ఫార్ములా అని టీడీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది క్విడ్ ప్రోకో వ్యవహారంగా అభివర్ణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన పొత్తులో భాగ‌మైతే టీడీపీకి మ‌రింత ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే టీడీపీ ఆఫర్‌పై బీజేపీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఒకసారి మోసం చేసిన చంద్రబాబు మళ్లీ దోస్తీ చేయడంపై బీజేపీ పార్టీ నేతలు అస్సలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. “జనసేనతో పొత్తు పెట్టుకునే మొదటి ఆప్షన్‌తో మేం ఓకే. కలిసి ఎన్నికల్లో పోరాడుతాం. అయితే పొత్తులో భాగంగా ఎవరు తప్పుకుంటారన్నది త్వరలోనే తెలియనుంది. మరే ఇతర పార్టీ కోసం త్యాగం చేయడానికి మేము సిద్ధంగా లేము’’ అని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో చంద్రబాబు ఆఫర్ పై బీజేపీ పెద్దగా ఆసక్తి లేదు. కేంద్రంలోని పెద్దలు ఒకవేళ ఆఫర్ తీసుకుంటే జనసేనను సైడ్ చేసినట్టేనన్న చర్చ సాగుతుంది. బీజేపీ, టీడీపీ కలిస్తే మాత్రం ఏపీ రాజకీయాలు వేగంగా మారడం ఖాయం..