Chandrababu on Jagan Regime: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై(Jagan Mohan Reddy) విమర్శలు చేశారు. రాష్ర్టంలో అరాచక పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడాలని సూచించారు. పార్టీ ఎస్సీ నేతలతో సమావేశం నిర్వహించి వారిలో నాయకత్వ మార్పు రావాలని పిలుపునిచ్చారు. దళితులకు పథకాలు అందడం లేదని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎస్సీలపై దాడులు నిత్యకృత్యంగా మారిందని నిప్పులు చెరిగారు ఎస్సీలను నమ్మించి ఓట్లు వేయించుకుని తరువాత పట్టించుకోవడం లేదని వాపోయారు. ఏరు దాటేదాక ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు జగన్ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించాక వారిపైనే దాడులు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
జగన్ అధికారంలోకి వచ్చా వందల సంఖ్యల దళితులప దాడులు జరగడం చూస్తున్నామని పేర్కొన్నారు. జగన్ అరాచక పాలనతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు భయపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులపై పోరాటం సాగించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. టీడీపీ వారి పక్షాన నిలబడుతుందని చెప్పారు. శాసన సభ వేదికగా దీనిపై నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం బీసీలపై కూడా సవతితల్లి ప్రేమ చూపుతుందని చెప్పారు. బీసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అందించే సుమారు 35 పథకాలను జగన్ రద్దు చేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఇవ్వడం లేదని వాపోయార. రాజకీయంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ నిధులు ఖర్చు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. మొహర్రం సందర్భంగా ముస్లింలకు సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. అందరు సమైక్యంగా ఉంటూ అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.