చంద్రబాబు, మోడీ.. ఫ్లాష్ బ్యాక్ చెప్పిన వీర్రాజు

అది 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సంగతి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న చివరి రోజులు.. తెలుగు దేశం పార్టీని ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా నందమూరి తారకరామారావు స్థాపించారో.. అదే కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు తీరు చూసి తెలుగు తమ్ముళ్లే ఘోళ్లు మన్న పరిస్థితి. నాడు నరేంద్రమోడీని ఓడించడానికి సపరేట్ విమానాలు మాట్లాడుకొని చంద్రబాబు అన్ని రాష్ట్రాలు, పార్టీలను కలిసి కాంగ్రెస్ తో జట్టు కట్టి ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బ్యాడ్ […]

Written By: NARESH, Updated On : May 31, 2021 1:35 pm
Follow us on

అది 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సంగతి. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న చివరి రోజులు.. తెలుగు దేశం పార్టీని ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా నందమూరి తారకరామారావు స్థాపించారో.. అదే కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు తీరు చూసి తెలుగు తమ్ముళ్లే ఘోళ్లు మన్న పరిస్థితి. నాడు నరేంద్రమోడీని ఓడించడానికి సపరేట్ విమానాలు మాట్లాడుకొని చంద్రబాబు అన్ని రాష్ట్రాలు, పార్టీలను కలిసి కాంగ్రెస్ తో జట్టు కట్టి ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు.

కానీ బ్యాడ్ లక్. చంద్రబాబు ఓడిపోయారు. ఏపీలో అధికారం కోల్పోయారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని.. రాహుల్ ను ప్రధాని చేయాలన్న ఆయన ఆశ అడియాశైంది. అందుకే గెలిచాక బీజేపీ శరణు వేడేలా నలుగురు రాజ్యసభ ఎంపీలను పువ్వుల్లో పెట్టి బీజేపీలోకి పంపించారన్న అపవాదును చంద్రబాబు ఎదుర్కొన్నారు.

అయితే తాజాగా మహానాడు సందర్భంగా బీజేపీకి చంద్రబాబు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని.. బీజేపీ, జనసేన కలిసి రావాలని కోరారు. అయితే చంద్రబాబు అవసరార్థం రాజకీయాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగానే స్పందించారు.

నరేంద్రమోడీ ప్రధానిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలను బీజేపీ నిర్వహించింది. విజయవాడలో వలస కార్మికులను ఆహార పొట్లాలను పంచిన సోము వీర్రాజు తాజాగా మాట్లాడారు. ‘ఊళ్లో పెళ్లి అవుతుంటే ఎవరికో హడావుడి అన్నట్టు.. ఇప్పుడు కేంద్రానికి మద్దతిస్తానని చంద్రబాబు నాటకాలాడుతున్నారని’ దుయ్యబట్టారు. ఒకే ఒక్క డైలాగ్ తో చంద్రబాబును సోము వీర్రాజు కడిగిపారేశారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్రమోడీని రెండోసారి ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చంద్రబాబు చేసిన కుట్రలను బీజేపీ మరిచిపోదని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలను అమానించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ రెండింటికి సమదూరంగానే ఉంటామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.