https://oktelugu.com/

Chandrababu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో పొత్తుపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు

Chandrababu Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో మరో అనూహ్యమైన పొత్తుకు శ్రీకారం పడింది.. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఏపీలో భీకరంగా తయారై తనను, పవన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న జగన్ ను ఎదుర్కొనేందుకు కలిసి నడవాల్సిన అవసరాన్ని చంద్రబాబు గురించారు. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు తాజాగా సంచలన ప్రకటన చేశారు. చం చంద్రబాబులో పవన్ కళ్యాణ్ పై ఆశ చావలేదు. పవన్ అంగీకరించాలే కానీ జనసేనతో పొత్తుకు పరిగెత్తుకు వస్తానని […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2022 / 10:28 PM IST
    Follow us on

    Chandrababu Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో మరో అనూహ్యమైన పొత్తుకు శ్రీకారం పడింది.. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఏపీలో భీకరంగా తయారై తనను, పవన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న జగన్ ను ఎదుర్కొనేందుకు కలిసి నడవాల్సిన అవసరాన్ని చంద్రబాబు గురించారు. అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు తాజాగా సంచలన ప్రకటన చేశారు.

    చం

    చంద్రబాబులో పవన్ కళ్యాణ్ పై ఆశ చావలేదు. పవన్ అంగీకరించాలే కానీ జనసేనతో పొత్తుకు పరిగెత్తుకు వస్తానని హింట్ ఇచ్చాడు. తాజాగా ఈరోజురాత్రి కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఓ అనూహ్య ప్రశ్న ఎదురైంది. ఓ టీడీపీ కార్యకర్త చంద్రబాబును సూటింగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు.

    దీనికి చంద్రబాబు అంతే నాటుగా సమాధానమిచ్చాడు.. ‘ప్రేమ అంటే రెండు వైపులా ఉండాలి తమ్ముడు.. ఒకవైపే ఉంటే వన్ సైడ్ లవ్ అవుతుంది’ అని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.

    దీన్ని బట్టి పవన్ తో పొత్తుకు తనకేం అభ్యంతరం లేదని.. పవన్ కూడా తనతో పొత్తుకు ఆసక్తి చూపించాలని చంద్రబాబు హింట్ ఇచ్చాడు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటన ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనమే అని చెప్పాలి.

    ఎందుకంటే అటు పవన్ ను, ఇటు చంద్రబాబును సీఎం జగన్ ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. పవన్ బీజేపీతో వెళుతుండగా.. చంద్రబాబు ఒంటరిగా పోరాడుతున్నారు. పవన్, చంద్రబాబు కలిస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా అవతరిస్తారు. మరి నిజంగా వీరు కలుస్తారా? చంద్రబాబు పొత్తు ఆహ్వానానికి పవన్ స్పందించి కలుస్తారా? అన్నది వేచిచూడాలి. కలిస్తే మాత్రం ఏపీలో మరోసారి అధికారం దిశగా ఈ కూటమి సాగడం ఖాయం. ఏం జరుగుతుందనేది పవన్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు తనకు పొత్తు ఇష్టమేనని.. పవన్ యే స్పందించాలని బంతిని ఆయన కోర్టులోకి నెట్టారు.

    పవన్ తో పొత్తుపై మాట్లాడిన చంద్రబాబు వీడియో..