Chandrababu Comments: చంద్రబాబు చేసిన ‘లవ్’ కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. తనది ‘వన్ సైడ్ లవ్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేక వర్గాలు రచ్చ చేస్తున్నాయి. చంద్రబాబుది వన్ సైడ్ కాదు.. టూసైడ్ లవ్ అంటూ ఆయనపై వైసీపీ మంత్రులు విమర్శల దాడి చేస్తున్నారు. చంద్రబాబు గతంలోనూ చాలా మంది లవ్ చేశారని, ఇలా చేయడం బాబుకు కొత్తేమీ కాదని వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. అన్నీ తెలిసే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాబు వేసిన ‘లవ్’ కొశ్చెన్ కు మాత్ర అసలైన పార్టీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. టీడీపీ నాయకులు లవ్… లవ్.. అంటున్నా జనసేన నాయకులు మాత్రం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కానీ వైసీపీ నాయకులు మాత్రం ఆటాడేసుకుంటున్నారు.
ఏపీలో టీడీపీ చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల బాబు కుప్పం పర్యటన సందర్భంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్త ఉంటుందని చెప్పకనే చెప్పారు. అయితే ఈ విషయంపై రెండు పార్టీల నాయకులు మాత్రం కలిసి ప్రకటించలేదు. కానీ కుప్పం పర్యటన సందర్భంగా బాబు ‘ప్రేమ అనేది ఒకవైపు ఉంటే సక్సెస్ కాదు తమ్మడూ.. ’అని కామెంట్లు చేశారు. దీంతో జనసేన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా మరుసటి రోజు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ప్రస్తుతం ఆరాచక పాలన కొనసాగుతుందని, ఈ ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో పరోక్షంగా బాబు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పారు.ఆయితే గత కొన్ని నెలలుగా టీడీపీ, జనసేనల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూ వస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాబు తాజాగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ‘వన్ సైడ్ లవ్’ కామెంట్ చేశారు. అంటే పొత్తు విషయంలో ఇరు పార్టీల నుంచి స్పందన ఉండాలని ఆయన అర్థం.
కానీ జనసేన నేత పవన్ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. పొత్తు విషయంలో ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో టీడీపీతో కలిసి వెళ్తాడా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇటు టీడీపీ తరుపున బాబుతో పాటు ఇతర నాయకులు సైతం జనసేనతో పొత్తు ఉంటుందని పలు సందర్బాల్లో పరోక్షంగా చెబుతున్నారు. కానీ జనసేన నాయకులు మాత్రం ఏ విధంగా స్పందించడం లేదు. ఆ పార్టీ నుంచి పవన్ మాత్రమే కాకుండా ఇతర నాయకులు సైతం ఏ విధంగా స్పందించడం లేదు.
అయితే వైసీపీ మంత్రులు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలపై రచ్చ చేస్తున్నారు. ‘బాబుది వన్ సైడ్ లవ్… కాదని టూసైడ్ లవ్.. అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నీ తెలిసే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ లమధ్య ఎప్పుడో పొత్తు కుదిరిందని అయితే ఇప్పుడు జనంలో సానుభూతి కొత్త కొత్త నాటకం ఆడుతున్నారని మరో మంత్రి కన్నబాబు ఆరోపించారు. బాబుది అబద్దాల ఫ్యాక్టరీ అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థం కోసం ఎవరినైనా లవ్ చేస్తారని, అంతకుముందు ఇతర పార్టీలను కూడా లవ్ చేశారని ఆరోపించారు.